calender_icon.png 9 May, 2025 | 12:01 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కులగణన చెల్లుబాటెంత?

09-02-2025 10:19:07 AM

హైదరాబాద్: దేశంలోనే ఎక్కడా లేని విధంగా తెలంగాణలో కులగణన సర్వే(Census Survey) పూర్తి చేశామని కాంగ్రెస్‌ ప్రభుత్వం ఓ వైపు ప్రచారం చేసుకుంటుండగా అసలు ఈ సర్వే చెల్లుబాటు అవుతుందా? అని బీసీ వర్గాల్లో అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయని బీఆర్‌ఎస్‌ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(BRS Working President KTR) ప్రశ్నించారు. కమిషన్లు కాకుండా ప్రభుత్వం సేకరించే డాటాకు సాధికారత ఉండబోదని, కేంద్రం నిర్దేశించిన నమూనాలోనే రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో సర్వే చేస్తే ఫలితం ఉంటుందని న్యాయనిపుణులు, బీసీ మేధావులు స్పష్టం చేస్తుండగా బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల సాధన కోసం ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు బీఆర్‌ఎస్‌ సిద్ధమైందని కేటీఆర్(KTR) పేర్కొన్నారు. 

రిజర్వేషన్ల చట్టం వచ్చిన తర్వాతే రాష్ట్రంలో స్థానిక ఎన్నికలు నిర్వహించాలని సీఎస్‌ శాంతికుమారి(CS Shanti Kumari)కి శనివారం వినతిపత్రం ఇచ్చారు. కులగణన సర్వే తప్పుల తడకపై ఓవైపు పోరాటం చేస్తూనే మరోవైపు 42 శాతం రిజర్వేషన్‌ అమలు కోసం కార్యాచరణ రూపొందించేందుకు నేడు బీసీ నేతల(BC leaders)తో బీఆర్‌ఎస్‌ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమావేశం కానున్నారు.

నిబంధనలే పాటించని కాంగ్రెస్ సర్కారు

ఇష్టారీతిన ఇంటింటి కుల గణన సర్వే.. తప్పులతడకగా కుల గణాంకాలు

జనాభా గణన అంశం కేంద్రానిదే

సర్వేపై రాష్ర్టాలకు పరిమితులు.. అందుకే అటకెక్కిన బీహార్‌ నివేదిక

న్యాయసమీక్షకు నిలవడం కష్టమే

బీసీ మేధావుల్లో, నేతల్లో తీవ్ర చర్చ: కేటీఆర్