ఇసుక సరఫరా పూర్తిగా ఆన్‌లైన్ ద్వారానే చేపట్టాలి
జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి
ఆలేరు, మార్చి 24 : జిల్లాలో ఇసుక సరఫరా పూర్తి గా ఆన్లైన్ ద్వారా నే చేపట్టాలని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి, సంబంధిత అధికారులకు సూచించారు. మంగళవాం రోజు కలెక్టరేట్, వీడియో కాన్ఫరెన్స్ హాలులో కలెక్టర్, ఎస్పీ యాదవ్ జిల్లాలో ఇసుక సరఫరా, వినియోగం, నిల్వలు, రవాణా తదితర అంశాలపై ఎస్పీ అక్షాంక్ష్ యాదవ్, రెవెన్యూ అదనపు కలెక్టర్ వెంకా రెడ్డి తో కలిసి మైన్స్ శాఖ అధికారులతో జిల్లా కలెక్టర్ అధ్యక్షతన సాండ్ కమిటీ సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజల అవసరాల కోసం మరియు ప్రభుత్వ అవసరాల కోసం అవసరమైన ఇసుక ను పూర్తి గా ఆన్లైన్ విధానం లోనే చేసుకొని పొందే విధంగా చర్యలు చేపట్టాలన్నారు. . ఇసుక రీచ్ల వద్ద నియమ నిబంధనలు కచ్చితంగా పాటించడంతో పాటు అక్రమ రవాణాను పూర్తిగా అరికట్టాలని ఆదేశించారు, ప్రజలకు పారదర్శకంగా ఇసుక అందుబాటులో ఉండే విధంగా చర్యలు చేపట్టాలని తెలిపారు.
అలాగే, ఆన్లైన్ బుకింగ్ వ్యవస్థను సమర్థవంతంగా అమలు చేసి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని సూచించారు, ఇసుక నిర్వహణను మరింత సమర్థవంతంగా నిర్వహించాలని పేర్కొన్నారు, ఈ సమావేశంలో రెవిన్యూ డివిజనల్ అధికారి కృష్ణా రెడ్డి, శేఖర్ రెడ్డి,అసిస్టెంట్ డైరెక్టర్ మైనింగ్ రవికుమార్, ఇరిగేషన్ యస్ ఈ రవీందర్ ,జిల్లా రవాణా అధికారి హరికృష్ణా,సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.




