25 April, 2026 | 1:31 PM

బీఆర్‌ఎస్వీ స్టేట్ సెక్రటరీ ప్రశాంత్ అరెస్ట్

29-11-2024 01:34 AM
  1. సీవీఆర్ కాలేజీ యాజమాన్యానికి బెదిరింపులు 
  2. 24 రోజుల రిమాండ్ విధించిన న్యాయమూర్తి

రాజేంద్రనగర్, నవంబర్ 28: సీవీఆర్ కాలేజీ యాజమాన్యంపై బెదిరిం పులకు పాల్పడిన బీఆర్‌ఎస్వీ స్టేట్ సెక్రటరీ నాగారపు ప్రశాంత్‌ను నార్సింగి పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. నార్సింగి ఇన్‌స్పెక్టర్ హరికృష్ణారెడ్డి తెలిపిన వివరాల ప్రకారం నాగారం ప్రశాంత్ సీవీఆర్ ఇంజినీరింగ్ కాలేజీలో అడ్మిషన్ల కొరకు చట్టవిరుద్ధంగా డిమాండ్ చేశాడని ఈనెల 16న సాయంత్రం కాలేజీ మేనేజర్ శ్రీపతి నారాయణరెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు.

కేసు నమోదు చేసిన నార్సింగి పోలీసులు గురువారం ఫిలింనగర్ పీఎస్ పరిధిలో ప్రశాంత్‌ను అరెస్ట్ చేసి రాజేంద్రనగర్‌లోని కోర్టులో జడ్జి ఎదుట హాజరుపరిచారు. న్యాయమూర్తి ప్రశాంత్‌కు 24 రోజుల రిమాం డ్ విధించినట్లు ఇన్‌స్పెక్టర్ తెలిపారు.