25 April, 2026 | 11:47 AM

స్క్రాప్ గోదామ్‌లో అగ్ని ప్రమాదం

29-11-2024 01:39 AM

భారీగా చెలరేగిన మంటలు 

కార్వాన్, నవంబర్ 28: గుడిమల్కాపూర్ పీఎస్ పరిధిలోని మొఘల్ కా నాలా సమీపంలో ఉన్న మహబూబ్ ప్రైడ్ ఫంక్షన్ హాల్ పక్కన ఉన్న స్క్రాప్ గోదామ్‌లో బుధవారం అర్ధరాత్రి అగ్ని ప్రమాదం చోటుచేసు కుంది. దీంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. లంగర్‌హౌస్ నుంచి రెం డు ఫైరింజన్లు ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపుచేశాయి. గోదామ్ పక్కనే నివాస ప్రాంతాలు ఉండటంతో స్థానికులు ఇళ్ల నుంచి పరుగులు పెట్టారు.

అగ్ని ప్రమాదం తో ప్రధాన రహదారిపై కిలో మీటర్ మేర వాహనాలు నిలిచిపోయాయి. ప్రమాదం విషయం తెలుసు కున్న కార్వాన్ ఎమ్మెల్యే కౌసర్ మొయినొద్దీన్ ఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. అగ్ని ప్రమాదంలో ఎంతమేర ఆస్తినష్టం జరిగిందో తెలియరాలేదు. పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.