4 September, 2026 | 8:22 AM

బొంతపల్లిలో దారుణ హత్య

14-11-2024 | 12:20pm
  • తల్లి కొడుకులను హతమర్చిన నిందితుడు 
  • పాత కక్షలే కారణం 

జిన్నారం(గుమ్మడిదల): గుమ్మడిదల మండలం బొంతపల్లి వీరభద్రనగర్ కాలనీలో తల్లి కొడుకును నడిరోడ్డుపై కత్తితో పొడిచిన ఘటన చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం బీహార్ రాష్ట్రానికి చెందిన నాగరాజు (30) బొంతపల్లి లోని వీరభద్రనగర్ లో నివాసం వుంటున్నాడు. రెండు సంవత్సరాల క్రితం వీరి కుమారుడు నీటి సంపులో పడి మృతి చెందాడు  వీరి ఇంటి ప్రక్కనే ఉత్తరప్రదేశ్ కి చెందిన సరోజ కుటుంబం నివాసం ఉంటుంది.

తన కుమారుడి మృతికి కారణం తన ఇంటి పక్కనే వున్న సరోజ(50), అతని కుమారుడు అనీల్ (30) కారణమని భావించాడు విరిపై పగను పెంచుకున్నాడు. కాగా గురువారం ఉదయం ఇంట్లో నుండి తల్లి కొడులులు బయటకు రాగానే ఇదే ఆదునుగా భావించిన నాగరాజు తల్లి కొడుకును కత్తితో పొడిచి హత్య చేశాడు. రక్తపు మడుగుల మధ్య తాళ్ళికొడుకు మృతి చెందాడు. ఘటనా స్థలాన్ని జిన్నారం సీఐ సుధీర్ కుమార్, గుమ్మడిదల ఎస్ఐ మహేశ్వర్ రెడ్డీలు పరిశీలించారు.