calender_icon.png 4 December, 2024 | 11:44 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కోరుట్లలో యువకుడి దారుణ హత్య

15-10-2024 10:35:17 AM

కోరుట్ల,(విజయక్రాంతి): జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలో ఓ యువకుని దారుణ హత్య సోమవారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం... కోరుట్ల పట్టణంలోని ప్రకాశం రోడ్డు కు చెందిన బోయిని సాగర్(33) అలియాస్ మంచోడు, అలియాస్ కళ్యాణ్ అనే యువకుడిపై సోమవారం అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు కత్తితో దాడి చేశాడు. దీంతో సాగర్ తీవ్రగాయాలపాలై అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న కోరుట్ల సిఐ సురేష్ బాబు, ఎస్ఐ శ్రీకాంత్ లు  సంఘటన  స్థలానికి చేరుకుని హత్యకు గల కారణాలపై విచారిస్తున్నారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.