calender_icon.png 4 December, 2024 | 11:42 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

శబరిమలకు పాదయాత్ర చేపట్టిన అయ్యప్ప స్వాములు

15-10-2024 10:41:07 AM

జగిత్యాల,(విజయక్రాంతి): జగిత్యాల జిల్లా మెట్ పల్లి నుండి శబరిమలకు అయ్యప్ప స్వాములు మంగళవారం పాదయాత్ర చేపట్టారు. సుమారు 1600 కిలోమీటర్లు పాదయాత్ర కొనసాగుతుందని గురుస్వామి పోతుగంటి రాజేందర్ తెలిపారు. మొదటి సారి పాదయాత్ర చేపట్టగా 40 మంది భక్తులు పాదయాత్రతో బయలు దేరారు. మెట్ పల్లి నుండి వేములవాడ, సిరిసిల్ల బెంగళూరు - శబరిమలకు వెళ్తున్నట్లు వెల్లడించారు. ఈ పాదయాత్ర మధ్యలో ఎవరైనా దాతలు ఉంటే సహాయం చేస్తే ఒకే, లేదంటే సొంత ఖర్చులతో తీసుకెల్లాలని నిశ్చయించుకు న్నానని, జనవరి 5వ తేదీన అక్కడ చేరుకుంటామన్నారు. కథలాపూర్ మండలంలోని అయ్యప్ప భక్తులు వారికి స్వాగతం పలికి తేనీరు అందజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ నాగేశ్వరరావు, గంగుల దేవరాజం, ఆమెటి గంగాధర్, శివ, కిషన్, తదితరులు పాల్గొన్నారు.