12 July, 2026 | 11:47 AM

సెన్సెక్స్ లక్ష పాయింట్లకు ఎప్పటికి!

05-05-2024 12:45 AM

నిఫ్టీ 25,000కు చేరేదెన్నడు!.. స్టాక్ సూచీల ల్యాండ్‌మార్క్‌లపై అంచనాలు

దేశంలో ప్రసిద్ధ ఇన్వెస్టరు దివంగత రాకేశ్ ఝున్‌ఝున్ వాలా గత దశాబ్దకాలం క్రితం నుంచి తరచూ చెప్పే మాట ‘అన్ని బుల్ మార్కెట్లను తలదన్నే బుల్ మార్కెట్ వస్తున్నది. సెన్సెక్స్ లక్ష పాయింట్లను చూస్తుంది’ అని. ఆ ఫీట్‌ను ఝున్‌ఝున్‌వాలా చూడలేకపోయినా ఆయన మదుపు చేసిన షేర్లు సెన్సెక్స్‌ను ఆ దిశగా నడిపించడంలో ఇప్పుడు ముఖ్య పాత్ర పోషిస్తున్నాయి. కొద్ది రోజుల కిందటే సెన్సెక్స్ చరిత్రాత్మక గరిష్ఠస్థాయి, కీలక మైలురాయి 75,000 పాయింట్లను తాకింది. అప్పటి నుంచి ఒడిదుడుకులకు లోనవుతున్నా, లక్ష పాయింట్ల స్థాయిని అందుకునే సత్తా సెన్సెక్స్‌కు ఉన్నదని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

నిఫ్టీ పయనమిది..

కోవిడ్ కాలం తర్వాత మార్కెట్ టెక్నికల్ ట్రెండ్‌ను నిపుణులు విశ్లేషిస్తూ మూడు బుల్, బేర్ మార్కెట్లు భారత్ చూస్తున్నదని, ఇప్పుడు రెండవ బుల్ మార్కెట్ నడుస్తున్నదని చెప్పారు. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ బడ్జెట్ ముందస్తుగా ర్యాలీ జరిపి 22,000 పాయింట్ల స్థాయిని తాకడాన్ని తొలి బుల్ మార్కెట్‌గా పేర్కొన్నారు. ప్రస్తుతం జరుగుతున్న రెండో బుల్ ట్రెండ్‌లో భాగంగా గత వారం నిఫ్టీ 23,000 స్థాయి సమీపానికి చేరడమని అన్నారు. ఇక తదుపరి బుల్ ట్రెండ్ 2024 దీపావళికి ముందుగా మొదలై నిఫ్టీ 24,000 పాయింట్ల స్థాయిని, 2025 ఫిబ్రవరి మధ్యకాలంలో 25,000 పాయింట్లకు చేరవచ్చని ఛాయస్ బ్రోకింగ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సుమీత్ బగాడియా అంచనా వేశారు.కీలక లక్ష్యాన్ని చేరే ఛాన్స్

కీలక లక్ష్యాన్ని చేరే ఛాన్స్

సాధారణంగా నిఫ్టీ సాధించిన లాభానికి సెన్సెక్స్ లాభం రెండింతలు ఉంటుందని, దీని ప్రకారం 2025 మార్చి చివరికల్లా  నిఫ్టీ 25,000 అందుకునే సమయానికి బీఎస్‌ఈ సెన్సెక్స్ 80,000 పాయింట్ల స్థాయిని చేరుకుంటందని ఆనంద్‌రాఠి సీనియర్ మేనేజర్ గణేశ్ దోంగ్రే అంచనా వేశారు. 2024 డిసెంబర్‌కల్లా నిఫ్టీ 24,000 పాయింట్లకు పెరగవచ్చని, సెన్సెక్స్ ప్రస్తుత ఏడాది 78,000 78,500 పాయింట్ల వరకూ ర్యాలీ జరపవచ్చని భావిస్తున్నట్టు తెలిపారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగిసిన తర్వాత రెండు, మూడేండ్లకు అంటే 2027 ఆర్థిక సంవత్సరానికల్లా లక్ష పా యింట్ల మేజిక్ ఫిగర్‌ను చేరే ఛాన్స్ ఉంటుందని ఆనంద్‌రాఠి నిపుణుడు అంచ నా వేస్తున్నారు. 2028 జనవరి త్రైమాసికంలో 1,00,000 పాయింట్ల మైలురాయిని సెన్సెక్స్ చేరవచ్చన్నారు.