31 July, 2026 | 9:34 AM

రాజకీయ వారసుడిని నియమించిన మాయావతి

23-06-2024 05:04 PM

లక్నో : ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, బీఎస్పీ పార్టీ అధినేత్రి మాయావతి కీలక నిర్ణయం తీసుకున్నారు. తన రాజకీయ వారసుడిగా మేనల్లుడు ఆకాష్ ఆనంద్ ను తిరిగి నియమిస్తూ పార్టీ సమన్వయకర్త బాధ్యతలను కూడా అప్పగించారు. గత ఏడాది డిసెంబర్ లో తన రాజకీయ వారసుడిగా మేనల్లుడిని ఎంపిక చేసి, ఈ ఏడాది మే నెలలో మాయామతి అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. జాతీయ కోఆర్డినేటర్ పదవి నుంచి తన వారసుడిగాను ఆకాష్ ను తొలగించారు. ఆయనకు రాజకీయ అనుభవం వచ్చే వరకు ఆ పదవుల నుంచి తొలగిస్తున్నట్లు ఆమె ఎక్స్ లో పేర్కొన్నారు. ఈ నిర్ణయంతో బీఎస్పీ నేతలు ఆశ్చర్యపోయారు. 2019లో సమాజ్ వాదీ పార్టీతో తెగతెంపులు చేసుకున్న తర్వత మాయావతి పార్టీ పటిష్టంపై దృష్టిసారించారు. 2019 లోక్ సభ ఎన్నికల్లో బీఎస్పీ 10 సీట్లు గెలుపొందింది. ఇటీవల జరిగిన 2024 లోక్ సభ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా దక్కించుకోలేకపోయింది.