31 July, 2026 | 10:18 AM

హరీష్‌రావు సీఎంకు లేఖ రాయడం విడ్డూరం

23-06-2024 04:33 PM

హైదరాబాద్‌: ఉద్యోగాల భర్తీపై హరీష్‌రావు సీఎంకు లేఖ రాయడం ఆశ్చర్యంగా ఉందని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్లలో లక్షా 60 వేల ఉద్యోగాలే భర్తీ చేసిందని ఆయన పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ మూడు నెలల్లోనే 30 వేల ఉద్యోగాలు భర్తీ చేసి గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌కు సిద్ధమయ్యాయి. గ్రూప్‌-1 ఉద్యోగాలు భర్తీ చేయడం ఇష్టం ఉందోలేదో హరీష్ రావు చెప్పాలని జీవన్‌ రెడ్డి డిమాండ్ చేశారు.