31 July, 2026 | 8:52 AM

బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేకు మంత్రి పొన్నం నోటీసులు

23-06-2024 05:04 PM

హైదరాబాద్‌: నేషనల్‌ థర్మల్‌ పవర్‌ కార్పొరేషన్‌ (ఎన్‌టీపీసీ) రామగుండంలో ఫ్లై యాష్‌ కుంభకోణంలో రూ. 100 కోట్ల అవినీతికి పాల్పడ్డారంటూ హుజూరాబాద్‌ బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే కౌశిక్‌ రెడ్డి చేసిన ఆరోపణలపై తెలంగాణ రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ లీగల్‌ నోటీసులు పంపారు. ఈ అంశంపై కౌశిక్ రెడ్డితో పాటు సంతోష్ కుమార్, తీగుళ్ల కృష్ణమూర్తి, తెలంగాణ పబ్లికేషన్ ప్రైవేట్ లిమిటెడ్, తెలంగాణ బ్రాడ్‌కాస్టింగ్ ప్రైవేట్ లిమిటెడ్‌లకు పరువు నష్టం దావా వేశారు. పొన్నం ప్రభాకర్‌ ఎన్‌టీపీసీ రామగుండం నుంచి రోజూ అక్రమంగా ఫ్లై యాష్‌ రవాణా చేస్తూ రూ.50 లక్షలు తీసుకుంటున్నారని కౌశిక్‌ రెడ్డి ఆరోపించారు. పొన్నం ప్రభాకర్ మేనల్లుడు డబ్బు వసూలు చేస్తున్నాడని తెలిపారు. తాను 13 ట్రక్కులను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నానని, అయితే రవాణా శాఖ రెండు ట్రక్కులను సీజ్ చేసిందని, మంత్రి ఫోన్ చేసిన తర్వాత మిగిలిన వాటిని వదిలేశారని కౌశిక్  పేర్కొన్నారు.