18 August, 2026 | 8:43 AM

ఇబ్రహీంపట్నంలో బీటెక్ విద్యార్థి ఆత్మహత్య

16-06-2024 12:22 AM

ఇబ్రహీంపట్నం, జూన్ 15 (విజయక్రాంతి) : బీటెక్ చదువుతున్న ఓ విద్యార్థి ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్‌ఐ మైబెల్లి తెలిపిన వివరాల ప్రకారం.. ఖమ్మం జిల్లా ఆరుపాలెం మండలం మామునూరుకి చెందిన సంగెపు రాంబాబు వ్యవసాయ కూలీ. తన కుమారుడు సంగెపు నరేంద్ర (27) ఇబ్రహీంపట్నం ఎంబీఆర్ నగర్‌లోని ఓ వైవేట్ హాస్టల్‌లో ఉంటూ, గురునానక్ ఇంజనీరింగ్ కాలేజీలో ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు.

అదేవిధంగా, ఆదిబట్లలోని ఎరోస్పేస్‌లో ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నాడు. నరేంద్ర శుక్రవారం అర్ధరాత్రి సమయంలో తన గదిలోని ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దీంతో హాస్టల్ యజమాని శనివారం ఉదయం కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చాడు. కుటుంబ సభ్యులు మృతదేహాన్ని ఇబ్రహీంపట్నంలోని ప్రభుత్వ దావఖానకు తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రేమ వ్యవహారం కారణంగానే నరేంద్ర ఆత్మహత్యకు పాల్పడినట్లు అతని స్నేహితులు చెబుతున్నారు. ఆత్మహత్యకి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.