1 May, 2026 | 5:15 PM

ఘనంగా బుద్ధ పూర్ణిమ వేడుకలు

01-05-2026 03:54 PM

వాంకిడి, (విజయక్రాంతి): మండల కేంద్రంలోని బుద్ధ విహార్ తో పాటు మండలంలోని బంబార, ఖమాన, ఇందాని, కవర్ గాం, ఖీరిడి, సరాండి తదితర గ్రామాల్లోని బౌద్ధ విహార్లలో బుద్ధ పౌర్ణమ వేడుకలను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. పంచాశీల జెండాలను ఎగురవేసి పాళీ భాషలో ప్రత్యేక ప్రార్థనలతో దమ్మ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ.. ప్రజలు బౌద్ధ దమ్మ మార్గంలో నడవాలని తెలిపారు. కార్యక్రమంలో  సర్పంచ్ కృష్ణాజి, ఉప సర్పంచ్ జాడే సంతోష్, జాడే ప్రభాకర్, వార్డ్ మెంబర్ సాలక్క గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.