calender_icon.png 2 February, 2026 | 3:04 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బడ్జెట్ ఎఫెక్ట్.. స్టాక్ మార్కెట్లు భారీగా పతనం

02-02-2026 01:30:10 AM

ఫ్యూచర్స్, ఆప్షన్స్‌పై ఎస్టీటీ పెంపుతో అమ్మకాల ఒత్తిడి

కుప్పకూలిన పీఎస్‌యూ బ్యాంకింగ్, మెటల్ షేర్లు

ప్రతికూల మార్కెట్‌లోనూ లాభపడిన ఐటీ రంగం

ముంబై, ఫిబ్రవరి 1: కేంద్ర బడ్జెట్ 2026 ప్రకటన స్టాక్ మార్కెట్లపై తీవ్ర ప్రభా వం చూపింది. ఫ్యూచర్స్, ఆప్షన్స్ ట్రేడింగ్‌పై సెక్యూరిటీస్ ట్రాన్సాక్షన్ ట్యాక్స్ (ఎస్టీటీ) పెంచాలన్న ప్రభుత్వ నిర్ణయంతో ఇన్వెస్టర్లు అమ్మకాలకు తెగబడ్డారు. ఫలితంగా, గత ఆరేళ్లలో బడ్జెట్ రోజున సూచీలు ఇంత భారీ గా పతనం కావడం ఇదే తొలిసారి. శనివారం జరిగిన ప్రత్యేక ట్రేడింగ్ సెషన్లో సెన్సె క్స్, నిఫ్టీలు దాదాపు 2 శాతం మేర నష్టపోయాయి. ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 80,723 వద్ద స్థిరపడగా, నిఫ్టీ 495 పాయింట్లు కోల్పోయి 24,825 వద్ద ముగిసింది. అయితే, రోజు మధ్యలో అమ్మకాల ఒత్తిడి తార స్థాయికి చేరడంతో సెన్సెక్స్ ఏకం గా 3,000 పాయింట్ల వరకు పతనమై 79, 899.42 వద్ద ఇంట్రా-డే కనిష్ఠాన్ని తాకింది. నిఫ్టీ కూడా 24,572 స్థాయికి పడిపోయింది. 

బడ్జెట్‌లో ఎస్టీటీ పెంపును ప్రకటించడంతో..

ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తన బడ్జెట్ ప్రసంగంలో ఎస్టీటీ పెంపును ప్రకటించడమే ఈ అమ్మకాలకు ప్రధాన కారణ మైంది. ఫ్యూచర్స్ ట్రేడ్స్‌పై పన్నును 0.02 శాతం నుంచి 0.05 శాతానికి, ఆప్షన్స్ ప్రీమియంపై పన్నును 0.1 శాతం నుంచి 0.15 శాతానికి పెంచారు. ఈ నిర్ణయంతో ట్రేడిం గ్, ఫైనాన్షియల్ స్టాక్స్‌లో అమ్మకాలు వెల్లువెత్తాయి. మార్కెట్లోని భయాలకు అద్దం పట్టే ఇండియా VIX సూచీ దాదాపు 12శాతం ఎగబాకింది. ఈ నష్టాలు కేవలం పెద్ద కంపెనీలకే పరిమితం కాలేదు.

మిడ్‌క్యాప్, స్మాల్ క్యాప్ సూచీలు కూడా 2శాతం పైగా నష్టపోయాయి. ఐటీ రంగం మినహా అన్ని రంగాల సూచీలు నష్టాల్లో ముగిశాయి. ముఖ్యంగా ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ షేర్లు అత్యధికంగా 6% పతనమవగా, మెటల్ షేర్లు 4 శాతం నష్టపోయాయి. భారత్ ఎలక్ట్రానిక్స్, హిం దాల్కో, ఓఎన్జీసీ వంటి షేర్లు 6 శాతం వరకు నష్టపోగా, ప్రతికూల మార్కెట్‌లోనూ విప్రో, టీసీఎస్ వంటి ఐటీ స్టాక్స్ 2% లాభపడి కాస్త ఊరటనిచ్చాయి.

సామాన్యులకు శుభవార్త

బంగారం, వెండి ఎక్స్ఛేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ కూడా ఈ పతనం నుంచి తప్పించుకోలేకపోయాయి. శుక్రవారం, ఆదివారం కలిపి చాలా వరకు ఈటీఎఫ్లు 15 నుంచి 20 శాతం వరకు నష్టపోయాయి. దీనివల్ల రిటైల్ ఇన్వెస్టర్లు భారీగా నష్టపోయారు. అయితే, దీర్ఘకాలిక ఇన్వెస్టర్లు ఆందోళన చెందవద్దని, ఇది కేవలం ఒక సరిదిద్దే ప్రక్రియ మాత్రమేనని నిపుణులు సూచిస్తున్నారు. ధరల పతనం సామాన్యులకు ఒక విధంగా శుభవార్తే. పెళ్లిళ్ల సీజన్ నడుస్తున్న తరుణంలో బంగారం ధరలు తగ్గడం ఊరటనిస్తుంది. 

బంగారం, వెండి  ధర పాతాళానికి 

పసిడి తులం 1. 4, వెండి కిలో 2.74లక్షలు

ఒక్కరోజే 6 శాతం పతనం

బడ్జెట్ రోజున సాధారణంగా మార్కె ట్లు ఊగిసలాటలో ఉంటాయి, కానీ ఈసారి బంగారం, వెండి ధరలు పాతాళానికి పడిపోవడం ఇన్వెస్టర్లను దిగ్భ్రాంతికి గురిచేస్తోంది. ఆదివారం ప్రత్యేక ట్రేడింగ్ సెషన్లో బంగారం ధర 10 గ్రాములకు రూ. 1.4 లక్షలకు పడిపోగా, వెండి కిలోకు రూ. 2.74 లక్షల స్థాయికి చేరుకుంది. కేవలం రెండు రోజుల వ్యవధిలోనే వెండి ధర రికార్డు గరిష్టాల నుంచి సుమారు 35- శాతం పతనం కావడం గమనార్హం. అమెరికా ఫెడరల్ రిజర్వ్ తదుపరి చైర్మన్‌గా ‘హాకిష్’ (కఠిన నిర్ణయాలు తీసుకునే) వ్యక్తిని డొనాల్డ్ ట్రంప్ నామినేట్ చేయబోతున్నారనే వార్తలు అంతర్జాతీయంగా డాలర్ విలువను పెంచాయి.

దీంతో బంగారంపై పెట్టుబడులు ఒక్కసారిగా వెనక్కి వెళ్లాయి. బడ్జెట్‌లో బంగా రంపై దిగుమతి సుంకాన్ని ప్రస్తుతం ఉన్న 6 శాతం నుంచి 4 శాతానికి తగ్గించే అవకాశం ఉందనే ప్రచారం వ్యాపారుల్లో ఆం దోళన కలిగించింది. ఒకవేళ సుంకం తగ్గితే, దేశీయంగా ధరలు మరో రూ. 3,000 వరకు తగ్గే అవకాశం ఉండటంతో ట్రేడర్లు భారీగా విక్రయాలకు పాల్పడ్డారు. జనవరి నెలలో బంగారం, వెండి ధరలు అసాధారణంగా పెరగడంతో, ఇన్వెస్టర్లు తమ లాభాలను నగదు రూపంలోకి మార్చుకునేందుకు పోటీ పడ్డారు.