14 April, 2026 | 2:32 AM

విద్యుత్తు సబ్సిడీకి రూ. 14 వేల కోట్ల బడ్జెట్ ఉత్తర్వులు

14-04-2026 12:00 AM

పరిపాలనా అనుమతులు జారీ చేసిన ప్రిన్సిపల్ సెక్రటరీ

హైదరాబాద్, ఏప్రిల్ ౧3 (విజయక్రాంతి): వ్యవసాయంతో పాటు ఇతర విద్యుత్తు సబ్సిడీలకు సంబంధించిన బడ్జెట్‌ను రిలీజ్‌కు పరిపాలనపరమైన అనుమతులు జారీచేస్తూ సోమవారం రాష్ట్ర విద్యుత్తు శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో 2026-27 ఆర్థిక సంవత్సరంలో రెండు డిస్కంలకు సంబంధించి రూ. 14 వేల కోట్ల విద్యుత్తు సబ్సిడీలకు  చెల్లించే వెసులుబాటు కలిగింది.