calender_icon.png 6 December, 2024 | 4:35 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ముస్లీం మైనారిటీ రెసిడెన్షియల్ పాఠశాలకు తాళం

15-10-2024 10:57:44 AM

హుజూర్ నగర్,(విజయక్రాంతి): గురుకుల పాఠశాల భవనానికి అద్దె చెల్లించలేదని యాజమాని పాఠశాలకు తాళం వేసిన ఘటన హుజూర్ నగర్ లో మంగళవారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్లితే... సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ లోని తెలంగాణ ముస్లీం మైనారిటీ రెసిడెన్షియల్ పాఠశాలకు భవన యాజమాని తాళం వేశారు.

గత 13 నెలలుగా భవన  అద్దె బకాయిలు చెల్లించకపోవడంతో చాలా సార్లు ప్రవేట్ భవన యాజమాన్య సంఘం ఆధ్వర్యంలో ఉన్నతాధికారులకు వినతి పత్రం ఇచ్చారు. అయిన ఎలాంటి స్పందన లేకపోవడంతో ఆవేదన చెందిన బిల్డింగ్ యాజమాని పెండింగ్ అద్దె బకాయిలు చెల్లించిన తరువాతే తాళాలు తీస్తామని చెబుతున్నారు. టీచర్లు, విద్యార్దులను పాఠశాల లోకి అనుమతించలేదు. దీంతో పాఠశాల గేట్లకు తాళం వేయడంతో టీచర్లు విద్యార్దులు బైటనే నిరీక్షించారు.