15 June, 2026 | 2:44 PM

Breaking News

పెద్దపల్లిలో కాంగ్రెస్ బూత్ లెవెల్ ఏజెంట్ల శిక్షణ తరగతులు   •   తెలంగాణ ఏర్పాటును ఏనాడూ జనసేన వ్యతిరేకించలేదు   •   ప్రైవేటు పాఠశాలలపై చర్యలు తీసుకోవాలి   •   మొదటి రోజున నూతనంగా చేరిన విద్యార్థులకు ఘనస్వాగతం   •   ప్రభుత్వ విద్యపై భరోసా.. కొడుకును ప్రభుత్వ పాఠశాలలో చేర్పించిన మచ్చుపేట సర్పంచ్   •   కర్కోటక కాంగ్రెస్ ప్రభుత్వం.. బెల్లంపల్లిలో కవిత హల్‌చల్‌   •   తెలుగు ఫిల్మ్ ఛాంబర్ సబ్ కమిటీ సమావేశం   •   కార్మికుల దీక్షలకు స్థానిక ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ ప్రత్యక్ష మద్దతు ఇవ్వాలి   •   యోగ దినచర్యలో భాగం కావాలి: జిల్లా ప్రోగ్రాం అధికారి   •   మంత్రి శ్రీధర్ బాబు ఆదేశాల మేరకు ఫిషరీస్ భూమి సర్వే పూర్తి   •  

ఫిబ్రవరి రేషన్ గడువు 19 వరకు పొడిగింపు...

18-02-2026 10:42 AM

- లబ్ధిదారులు తప్పనిసరిగా సరుకులు పొందాలి 

-ఎన్ఫోర్స్మెంట్ డిటి మాచన రఘునందన్

మునుగోడు, ఫిబ్రవరి 18 (విజయక్రాంతి) : ఫిబ్రవరి నెలకు సంబంధించిన రేషన్ సరుకుల పంపిణీ గడువును ఈ నెల 19వ తేదీ వరకు పొడిగించినట్లు పౌర సరఫరా శాఖ ఎన్‌ఫోర్స్‌మెంట్ డిప్యూటీ తహసీల్దార్ మాచన రఘునందన్ తెలిపారు. మునుగోడులో ఆయన మాట్లాడారు.లబ్ధిదారుల సౌలభ్యం దృష్ట్యా రేషన్ దుకాణాలను 19వ తేదీ వరకు తెరిచి ఉంచాలని అధికారులకు సూచించినట్లు చెప్పారు. ఇప్పటివరకు రేషన్ తీసుకోని వారు ఈ గడువు పొడిగింపును సద్వినియోగం చేసుకోవాలని కోరారు.వివిధ కారణాల వల్ల రేషన్ తీసుకోలేకపోయిన లబ్ధిదారులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని తమకు కేటాయించిన సరుకులను పొందాలని ఆయన సూచించారు. ఈ నిర్ణయం ద్వారా మిగిలిన వారందరికీ రేషన్ అందుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.