calender_icon.png 18 February, 2026 | 1:34 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

క్యాతన్‌పల్లిలో హైటెన్షన్.. కొనసాగుతున్న బంద్

18-02-2026 11:43:43 AM

హైదరాబాద్: మంచిర్యాల జిల్లా క్యాతన్ పల్లిలో(Kyathanahalli) బంద్ కొనసాగుతుంది. బీఆర్ఎస్, సీపీఐ పార్టీలు బంద్‌కు పిలుపునిచ్చాయి. వ్యాపారులు, స్థానికులు సంపూర్ణంగా బంద్‌లో పాల్గొన్నారు. బీఆర్ఎస్ బంద్‌తో(BRS bandh) క్యాతన్‌పల్లిలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. చైర్మన్ ఎన్నిక వాయిదాను నిరసిస్తూ బీఆర్ఎస్ నాయకులు ఆందోళన చేపట్టారు. నిన్నటి ఘర్షణల నేపథ్యంలో పోలీసులు అలర్ట్ అయ్యారు.

బీఆర్ఎస్, సీపీఐ(BRS, CPI) శ్రేణులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిన్నటి రాళ్లదాడి కేసులోనూ అరెస్టులపర్వం కొనసాగుతోంది. రాళ్లదాడి కేసులో ఏ4 దోమకొండ అనిల్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. మరో నిందితుడు రవీందర్ రెడ్డి ఇంటి వద్ద పోలీసులు మోహరించారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతల ఘర్షణలతో క్యాతన్‌పల్లి, ఖానాపూర్ మున్సిపల్ చైర్మన్ ఎన్నికలు నిలిచిపోయాయి. రెండు మున్సిపాలిటీల చైర్మన్ ఎన్నికలపై సస్పెన్స్ కొనసాగుతుంది.