calender_icon.png 18 February, 2026 | 12:36 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వంద శాతం సోలార్ విద్యుత్ వినియోగ గ్రామంగా గండుగులపల్లి: ఎమ్మెల్యే జారె

18-02-2026 10:53:48 AM

దమ్మపేట, (విజయక్రాంతి):  మండల పరిధిలోని అశ్వారావుపేట నియోజకవర్గ శాసనసభ్యులు జారె ఆదినారాయణ స్వగ్రామమైన గండుగులపల్లిలో ప్రభుత్వం పూర్తి సబ్సిడీతో అమలు చేస్తున్న సోలార్ విద్యుత్ పైలట్ ప్రాజెక్ట్ పనులను పరిశీలించారు. రాష్ట్ర ప్రభుత్వం పునరుత్పాదక శక్తి వినియోగాన్ని ప్రోత్సహిస్తూ గ్రామపంచాయతీ పరిధిలోని అన్ని గ్రామాలకు సౌర విద్యుత్ సదుపాయాలు కల్పిస్తోందని, ఈ క్రమంలో పైలట్ ప్రాజెక్ట్‌గా గండుగులపల్లి గ్రామం 100% సోలార్ విద్యుత్ ఉపయోగించే  గ్రామంగా  ఎంపిక కావడం గర్వకారణమని, ప్రస్తుతం సోలార్ ప్యానెల్లు అవసరమైన పరికరాల అమరికల పనులు వేగంగా కొనసాగుతున్నాయని, ఈ ప్రాజెక్ట్ పూర్తయిన తర్వాత గ్రామ ప్రజలకు నిరంతర విద్యుత్ సరఫరా అందడంతో పాటు విద్యుత్ బిల్లుల భారం తగ్గి వారికే అదనపు ఆదాయం లభించనుందని పేర్కొన్నారు. పర్యావరణ పరిరక్షణకు సోలార్ విద్యుత్ తోడ్పడుతుందని, గ్రామీణాభివృద్ధికి ఈ ప్రాజెక్టు ఒక మైలురాయిగా నిలుస్తుందన్నారు. గండుగులపల్లి రాష్ట్రానికి ఆదర్శ గ్రామంగా నిలవాలని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.