16 April, 2026 | 10:14 PM

Breaking News

సదాశివపేట పట్టణ ప్రజల తాగునీటి సమస్యలపై జగ్గారెడ్డి, నిర్మల సమీక్ష   •   గురుకుల విద్యాలయాలపై నిరంతర పర్యవేక్షణ: కలెక్టర్ బాదావత్ సంతోష్   •   బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య వ్యాఖ్యలను ఖండించిన హరీశ్‌రావు   •   ముస్లిం రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధం: అమిత్ షా   •   పెళ్లి చేసుకుంటానని మహిళపై అత్యాచారం.. బీజేపీ కౌన్సిలర్ కుమారుడిపై కేసు   •   99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికతో సమగ్ర మార్పు తీసుకురావాలి   •   ముదిరాజులు అన్ని రంగాల్లో రాణించాలి   •   మూడు మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు   •   ప్రభుత్వం హామీలు అమలు చేయకపోతే.. ఏప్రిల్ 22 నుంచి సమ్మె   •   సమన్వయంతో పనిచేస్తేనే అభివృద్ధి సాధ్యం   •  

తాండూర్ త్రిలింగేశ్వర ఆలయం వద్ద ఎడ్ల బండ్ల ప్రదర్శన

17-02-2026 12:51 AM

నాగిరెడ్డిపేట్, ఫిబ్రవరి 16 (విజయ క్రాంతి): శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని నాగిరెడ్డిపేట్ మండలంలోని తాండూర్ త్రిలింగేశ్వర ఆలయం వద్ద మూడు రోజులపాటు జాతర మహోత్సవం ఘనంగా నిర్వహిస్తారు. సోమవారం త్రిలింగేశ్వర ఆలయం వద్ద రెండవ రోజు ఎడ్ల బండి ప్రదర్శన కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేపట్టారు.

చుట్టుపక్కల గ్రామాల ప్రజలే కాకుండా దూరప్రాంతాల నుండి పెద్ద ఎత్తున భక్తులు తండోపు తండాలుగా పదివేల మంది భక్తులు ప్రజలు తరలివచ్చి ఎడ్లబండి ప్రదర్శన కార్యక్రమాన్ని తిలకించారు. త్రిలింగేశ్వర ఆలయం వద్ద డప్పు చప్పుట్లతో రెండవ రోజు ఐదు ఎడ్ల బండ్లు 16 ట్రాక్టర్లు ఆలయం చుట్టూ ఐదుసార్లు ప్రదర్శించారు.

భక్తులు శివునికి ప్రత్యేక పూజలు చేసి వారి కోరికలను కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో తాండూర్ అక్కంపల్లి, మాటూర్, వెంకంపల్లి గ్రామాల సర్పంచులు యాద గౌడ్, వెంకగౌడ్,భాగ్యశ్రీ సతీష్, చిలుకూరి జ్యోతి సుదర్శన్ రెడ్డి, ఆలయ కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు, భక్తులు పాల్గొన్నారు.