16 April, 2026 | 11:56 PM

Breaking News

సదాశివపేట పట్టణ ప్రజల తాగునీటి సమస్యలపై జగ్గారెడ్డి, నిర్మల సమీక్ష   •   గురుకుల విద్యాలయాలపై నిరంతర పర్యవేక్షణ: కలెక్టర్ బాదావత్ సంతోష్   •   బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య వ్యాఖ్యలను ఖండించిన హరీశ్‌రావు   •   ముస్లిం రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధం: అమిత్ షా   •   పెళ్లి చేసుకుంటానని మహిళపై అత్యాచారం.. బీజేపీ కౌన్సిలర్ కుమారుడిపై కేసు   •   99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికతో సమగ్ర మార్పు తీసుకురావాలి   •   ముదిరాజులు అన్ని రంగాల్లో రాణించాలి   •   మూడు మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు   •   ప్రభుత్వం హామీలు అమలు చేయకపోతే.. ఏప్రిల్ 22 నుంచి సమ్మె   •   సమన్వయంతో పనిచేస్తేనే అభివృద్ధి సాధ్యం   •  

కొత్తగూడెం ఏరియాలో మంత్లీ ప్రయాస్ మీటింగ్

17-02-2026 12:50 AM

కొత్తగూడెం, ఫిబ్రవరి 16 ( విజయక్రాంతి): కొత్తగూడెం ఏరియాలోని మాజీ ఉద్యోగుల పెన్షన్ ,సీఎంపిఎఫ్  సమస్యల పరిష్కారం కోసం కొత్తగూడెం ఏరియా ఇంచార్జ్ జిఎం అధ్యక్షతన, సోమవారం సీఎంపిఎఫ్ ఆధ్వర్యంలో జనరల్ మేనేజర్ కార్యాలయం నందు మంత్లీ ప్రయాస్ సమావేశం నిర్వహించారు. కొత్తగూడెం ఏరియా లోని మాజీ ఉద్యోగుల పెన్షన్, సీఎంపిఎఫ్ సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా  కమిషనర్ సీఎంపిఎఫ్  మాట్లాడుతూ, పెన్షన్ తీసుకుంటున్న మాజీ ఉద్యోగులు   బ్యాంక్ అకౌంట్ ను ఫార్మర్ సర్వేయర్ గా మార్చుకొని వారి యొక్క నామిని, మాజీ ఉద్యోగి భార్య ఆధార్ కార్డు ను సీఎంపిఎఫ్ ఆఫీస్ లో సమర్పించాలన్నారు . మాజీ ఉద్యోగి మరణాంతరం విడో పెన్షన్ కు ఎలాంటి జాప్యం జరగకుండా పెన్షన్ పొందుటకు అవకాశం ఉంటుందని తెలియజేశారు. 

కొత్తగూడెం ఏరియాలో పర్సనల్ డిపార్ట్మెంట్ అధికారులు ,సీఎంపిఎఫ్ క్లెయిమ్ సెటిల్మెంట్ చేసే సంబంధిత సిబ్బందితో ప్రాయాస్ అనే కార్యక్రమం పై ,మీటింగ్ నిర్వహించి సి-కేర్ పోర్టల్ ద్వారా క్లైమ్ సెటిల్మెంట్‌కు సంబంధించి, వివిధ విషయాలను క్షుణ్ణంగా చర్చించారు. సీఎంపిఎఫ్ క్లెయిమ్స్ సెటిల్మెంట్ కొరకు సి-కేర్ పోర్టల్ లో ,సంబంధిత సింగరేణి సిబ్బంది అప్లోడ్ చేస్తున్నప్పుడు ఉత్పన్నమవుతున్న సమస్యలను,  ఈ కార్యక్రమంలో నివృత్తి చేయడం జరిగింది.

ఈ సందర్భంగా సీఎంపిఎఫ్ కమిషనర్స్ మాట్లాడుతూ, ప్రాయాస్ మీటింగ్ రెగ్యులర్ గా సింగరేణి పర్సనల్ డిపార్ట్మెంట్ అధికారులు,   సీఎంపిఎఫ్ సెటిల్మెంట్ చేసే సిబ్బందితో క్లెయిమ్స్ సెటిల్మెంట్ లను త్వరితగతిన  పూర్తిచేయడం కొరకు, ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని  తెలియజేశారు.  సీఎంపిఎఫ్ క్లెయిమ్ త్వరితగతిన సీ-కేర్ పోర్టల్ ద్వారా జీరో పెండెన్సీ తో సిఎంపీఎఫ్ క్లెయిమ్స్ ను సెటిల్మెంట్ చేస్తున్న  కొత్తగూడెం ఏరియా మేనేజ్మెంట్ ను అభినందించారు. సీ-కేర్ పోర్టల్ ద్వారా ఈ  కార్యక్రమానికి హాజరైన మాజీ ఉద్యోగుల అప్లికేషన్లను తీసుకొని త్వరితగతిన పరిష్కరిస్తామని తెలియజేయడం జరిగింది.

ఈ కార్యక్రమంలో ఇంచార్జ్ జిఎం జి. వి కోటి రెడ్డి తో పాటు ,సీఎంపీఎఫ్ కమిషనర్స్ కే. వంశీధర్, ఎం.కనకమ్మ, అసిస్టెంట్ కమిషనర్ పి. చిరంజీవి, కొత్తగూడెం ఏరియా ఎఐటియుసి వైస్ ప్రెసిడెంట్ కే. రాములు, ఐఎన్టియూసి వైస్ ప్రెసిడెంట్ ఎండి రజాక్, ఎజిఎం (సివిల్) సిహెచ్ రామకృష్ణ, ఎజిఎం( ఫైనాన్స్) ఈ.భీబస్తా, ఎజిఎం (పర్సనల్) జి.వి. మోహన్ రావు, ఏరియా రక్షణాధికారి వెంకటేశ్వరరావు, సీనియర్ పిఓ ఎం. మురళి,  ఆర్.సి.హెచ్.పి ఇంచార్జ్ అజ్మీరా శ్రీనివాస్, కొత్తగూడెం ఏరియాలోని మైన్స్ అండ్ డిపార్ట్మెంట్ లోని సంబంధిత పెన్షన్ సెటిల్మెంట్ సిబ్బంది ,మాజీ ఉద్యోగులు పాల్గొన్నారు.