16 April, 2026 | 10:12 PM

Breaking News

సదాశివపేట పట్టణ ప్రజల తాగునీటి సమస్యలపై జగ్గారెడ్డి, నిర్మల సమీక్ష   •   గురుకుల విద్యాలయాలపై నిరంతర పర్యవేక్షణ: కలెక్టర్ బాదావత్ సంతోష్   •   బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య వ్యాఖ్యలను ఖండించిన హరీశ్‌రావు   •   ముస్లిం రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధం: అమిత్ షా   •   పెళ్లి చేసుకుంటానని మహిళపై అత్యాచారం.. బీజేపీ కౌన్సిలర్ కుమారుడిపై కేసు   •   99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికతో సమగ్ర మార్పు తీసుకురావాలి   •   ముదిరాజులు అన్ని రంగాల్లో రాణించాలి   •   మూడు మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు   •   ప్రభుత్వం హామీలు అమలు చేయకపోతే.. ఏప్రిల్ 22 నుంచి సమ్మె   •   సమన్వయంతో పనిచేస్తేనే అభివృద్ధి సాధ్యం   •  

ములుగు పురపాలక సంఘంలో నూతన నాయకత్వం

17-02-2026 12:51 AM

మున్సిపాలిటీ చైర్మన్గా చింతనిప్పుల చంద్రకళ

వైస్ చైర్మన్గా ఆసియా షాహిన్ ఏకగ్రీవ ఎన్నిక

నల్లెల కుటుంబానికి నిరాశ

ములుగు, ఫిబ్రవరి 16 (విజయక్రాంతి): ములుగు పురపాలక సంఘంలో చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికలు సోమవారం కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాలులో ప్రశాంత వాతావరణంలో నిర్వహించబడ్డా యి. ఎన్నికల కమిషన్ నిబంధనల మేరకు ములుగు పురపాలక సంఘం మరియు రాజస్వ మండల అధికారి ఎన్. వెంకటేష్ అధీకృత అధికారిగా ఎన్నిక ప్రక్రియను నిర్వహించారు. మొత్తం 20 మంది కౌన్సిలర్లతో ఆర్డీవో వెంకటేష్ ప్రమాణ స్వీకారం చేయించారు.

అనంతరం జరిగిన ఎన్నికలో 6వ వార్డు కౌన్సిలర్ చింతనిప్పుల చంద్రకళ ము లుగు మున్సిపాలిటీ చైర్మన్గా, 14వ వార్డు కౌన్సిలర్ ఆసియా షాహిన్ వైస్ చైర్మన్గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ కార్యక్రమానికి ఎక్స్ అఫిషియో మెంబర్ మరియు పంచాయతీ రాజ్, గ్రామీణ అభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క హాజరయ్యారు. ఎన్నికల సాధారణ పరిశీలకులు గంగాధర్ ఎన్నికల ప్రక్రియను పర్యవేక్షించారు. కొత్తగా ఎన్నికైన చైర్మన్, వైస్ చైర్మన్లు ములుగు పట్టణ అభివృద్ధికి కృషి చేస్తామని ఈ సందర్భంగా తెలిపారు.

నల్లెల కుటుంబానికి నిరాశ

ములుగు జిల్లా రాజకీయాల్లో ప్రత్యేక గుర్తింపు పొందిన నల్లెల కుమారస్వామి సేవలు స్థానికంగా ఇప్పటికీ స్మరించబడుతున్నాయి. కాంగ్రెస్ పార్టీలో కీలకంగా పని చేసిన ఆయన నాయకత్వంలో పార్టీకి బలమైన పునాది ఏర్పడిందని కార్యకర్తలు చెబు తుంటారు. ములుగు జిల్లా రాజకీయాల్లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించిన నల్లెల కుమారస్వామి పేరు తెలియని వారు అరుదు. కాంగ్రెస్ పార్టీలో తనదైన శైలిలో ప్రజల మన్ననలు పొందిన ఆయన, పార్టీ బాధ్యతలను భుజాన వేసుకుని నాయకులు, కార్యకర్తలు, ప్రజలకు అండగా నిలిచారు. తన కృషితో జిల్లా రాజకీయాల్లో గుర్తింపు పొందిన కుమారస్వామి అనారోగ్యంతో మరణించడం జిల్లా ప్రజలను తీవ్రంగా కలిచివేసింది.

తన మరణం వల్ల జిల్లా రాజకీ యాల్లో లోటుగా మారింది. అయితే ఇటీవల జరిగిన ములుగు మున్సిపల్ ఎన్నికల్లో కుమారస్వామి కోడలు నల్లెల స్వాతి 8వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి 64 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఈ విజయం తో కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేశా రు. కుమారస్వామి ఆశయాలను కొనసాగించే నాయకురాలిగా స్వాతిని అభినందిం చారు. చైర్మన్ పీఠం తమ కుటుంబానికే వస్తుందనే నమ్మకంతో ఆశలు పెట్టుకున్నారు. అయితే చైర్మన్ పదవి దక్కకపోవడంతో కుటుంబ సభ్యులు తీవ్ర నిరాశకు గురయ్యారు. తమ కుటుంబ పెద్దగా నిలిచిన కుమారస్వామి చిత్రపటం ముందు కుటుంబీకులు బోరున విలపిస్తూ కన్నీటి పర్యంత మయ్యారు. 

ఈ ఘటనకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతూ స్థానికంగా చర్చనీయాంశమైంది. ఆ వీడి యో చూసిన ప్రతి ఒక్కరి కంట నీళ్లు తెప్పించింది.పార్టీ కోసం జీవితాన్ని అర్పించిన నాయకుడి కుటుంబం ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొనడం, పార్టీ కోసం కష్టపడిన నాయకుడి కుటుంబానికి పదవి దక్కకపోవడం పట్ల అనుచరులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.