26-09-2025 12:58:22 PM
దసరా ముందు రోజు లక్కీ డ్రా.
సోషల్ మీడియాలో జోరుగా వైరల్
తుంగతుర్తి(విజయక్రాంతి): దసరా దీపావళి పండుగలకు బట్టలు ,మొబైల్స్, ఎలక్ట్రిక్ వాహనాల షోరూంలో బంపర్ ఆఫర్లు పెడతాయి, మావద్ద 30 శాతం, 50 శాతం ,70 శాతం అంటూ బంపర్ ఆఫర్ త్వరపడండి అంటూ బంపర్ బోనాంజా ఆఫర్లు గల్లీలోని చిన్నచిన్న దుకాణాలు మొదలుకొని పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ వరకు ఆఫర్ లంటూ డిస్కౌంట్ లు అంటూ ప్రజలను ఆకర్షించే విధంగా ప్రచారం చేస్తాయి. ఇవన్నీ రొటీన్ అయినప్పటికీ తాజాగా దసరా సందర్భంగా అన్నారంలో యువకుడు వెరైటీగా పొట్టేలు బంపర్ ఆఫర్ ప్రకటించాడు. మన ప్రాంతంలో అయితే దసరా పండుగ వచ్చిందంటే సుక్క, ముక్క ఆ కిక్కే వేరప్పా.... అన్నట్లుగా సెలబ్రేషన్స్ ఉంటాయి. కాబట్టి తుంగతుర్తి మండలంలోని అన్నారం గ్రామంలో శ్యామ్ అనే యువకుడు పండుగకు వారం రోజుల ముందే వెరైటీ బంపర్ ఆఫర్ ను గ్రామంలో ప్రజల ముందు ఉంచాడు.
రూ.150 కొట్టు పొట్టేలు పట్టు అన్నట్టుగా దసరా పేరుతో ఫ్లెక్సీ ఏర్పాటు చేశాడు. 150 రూపాయలతో కొనుగోలు చేసిన వారికి దసరా ముందు రోజు గ్రామపంచాయతీ ఆవరణంలో తీసే లక్కీ డ్రాలో గెలుపొందిన వారికి 13 కేజీల మేకపోతును బహుమతిగా అందజేయనున్నట్లు ప్రకటించాడు. ఇదంతా కేవలం దసరా పండుగకు హంగామా ఎంజాయ్ చేసేందుకు, ఎంటర్టైన్మెంట్ కోసం మాత్రమే అని ఆ వ్యక్తి చెప్పుకు రావడం గమనార్వం. ఎంతమంది ఎన్ని రూపాయలు కడతారో ,ఎంతమందికి మటన్ ఇస్తారో మరి వేసి చూడాల్సిందే.