calender_icon.png 26 September, 2025 | 1:55 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సామాజిక న్యాయానికి ప్రజా ప్రభుత్వం కట్టుబడి ఉంది

26-09-2025 12:46:10 PM

హుజూర్ నగర్: తెలంగాణ ప్రభుత్వం సామాజిక న్యాయానికి కట్టుబడి బీసీలకు విద్య, ఉద్యోగాలు, స్థానిక సంస్థలలో 42శాతం రిజర్వేషన్ కల్పించామని రాష్ట్ర నీటిపారుదల,పౌర సరఫరాల శాఖ మంత్రి నలమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి(Minister Uttam Kumar Reddy ) అన్నారు. శుక్రవారం సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ మండలంలోని బూరుగడ్డ గ్రామంలో చాకలి ఐలమ్మ(Chakali Ilamma) 135 వ జయంతి సందర్భంగా మాజీ ఎంపీపీ గూడెపు శ్రీను ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన చాకలి ఐలమ్మ విగ్రహాన్ని మంత్రి ఉత్తమ్ ప్రారంభించి మాట్లాడారు...చాకలి ఐలమ్మ జీవిత చరిత్ర చాలా గొప్పదన్నారు. ఆనాటి నిజాం ప్రభుత్వంలో భూసంస్కరణల కోసం విరోచిత పోరాటం చేశారని వారి చరిత్ర విద్యార్థులకు తెలిసేలా కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు.

ప్రజా ప్రభుత్వం చాకలి ఐలమ్మకు గుర్తింపుగా కోటి ఉమెన్స్ యూనివర్సిటీకి చాకలి ఐలమ్మ పేరు పెట్టడమే కాకుండా వారి పేరుకు తగ్గట్టుగా వందల కోట్లతో అభివృద్ధి చేసి దేశంలోనే అగ్రగామి యూనివర్సిటీగా నిలిపేందుకు కృషి చేస్తున్నామన్నారు. స్వాతంత్రం వచ్చిన తర్వాత దేశ చరిత్రలో మొదటిసారిగా తెలంగాణ ప్రభుత్వంలో  తాను చైర్మన్ గా ఉన్నా కమిటీ  3.70 కోట్ల మందిని ఇంటింటి సర్వే నిర్వహించి బిసి  కులగణన చేసిందని,రాష్ట్రంలో 50శాతం బీసీలు ఉన్నారన్నారు. ప్రజా ప్రభుత్వం బీసిలకు విద్యలో,ఉద్యోగాలు, స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్ కల్పించేందుకు రాష్ట్ర క్యాబినెట్, శాసనసభలో బిల్లును ఆమోదించి చట్టం చేశామని బీసీలకు అన్ని విధాల సహాయం చేసేందుకు మా ప్రభుత్వం చిత్తశుద్ధితో ముందుకెళ్తున్నామన్నారు.

బూరుగడ్డ నల్లకట్ట చెరువు తెగినప్పుడు 2.6 కోట్లతో యుద్ధ ప్రతిపాదికన మరమ్మతులు చేయించమన్నారు. దేవాలయం అభివృద్ధికి 80లక్షల రూపాయలు మంజూరు చేశామని పలు సిసి రోడ్లు నిర్మించామని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఆర్డీవో శ్రీనివాసులు, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసరెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ లు రాధికా, బెల్లంకొండ విజయలక్ష్మి,సాముల శివారెడ్డి,ఎరగాని నాగన్న గౌడ్,దొంగరి వెంకటేశ్వర్లు,ఈడుపుగంటి సుబ్బారావు, తన్నీరు మల్లికార్జున్,అజీజ్ పాషా,  తదితరులు,పాల్గొన్నారు