26-09-2025 12:24:10 PM
ఘట్ కేసర్ రైల్వే స్టేషన్ లో గంటపాటు సోదాలు
ఘట్ కేసర్, (విజయక్రాంతి): కోల్ కతా నుంచి సికింద్రాబాద్(Kolkata to Secunderabad)కు వస్తున్న ఫలక్ నుమా ఎక్స్ ప్రెస్ రైలులో ఉగ్రవాదులు ఉన్నరంటూ రైల్వే ప్రొటెక్షన్ ఇంటెలిజెన్స్ నుంచి సమాచారం అందింది. దీంతో అప్రమత్తమైన ఆర్పీఎఫ్ సిబ్బంది రైలును ఘట్ కేసర్ రైల్వే స్టేషన్ లో ఉదయం 9.50కి నిలిపివేసి అన్ని కంపార్ట్ మెంట్ లలో ముమ్మరంగా తనిఖీలు చేపట్టారు. అనుమానం వచ్చిన ప్రతి వ్యక్తితో పాటు వెంట ఉన్న బ్యాగేజీలను చెక్ చేశారు. సమారు గంట పాటు సోదాలు చేపట్టిన అనంతరం టెర్రరిస్టులు ఎవరూ లేరని నిర్ధారించాక 10.55 గంటలకు రైలు యథావిధిగా ముందుకు కదిలింది.