26-09-2025 01:48:39 PM
హైదరాబాద్: తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట యోధురాలు చాకలి (చిట్యాల) ఐలమ్మ(Chakali Ilamma) ధీరత్వానికి, తెలంగాణ నేల పోరాట పటిమకు ప్రతీకని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(Kalvakuntla Taraka Rama Rao) అన్నారు. భూమి కోసం, భుక్తి కోసం తిరుగుబాటు చేసి నిరంకుశ పాలనపై దండెత్తిన చాకలి ఐలమ్మ పోరాటం, త్యాగం చిరస్మరణీయమని పేర్కొన్నారు. చాకలి ఐలమ్మ స్పూర్తిని ప్రపంచానికి చాటే విధంగా కేసీఆర్ ప్రభుత్వం(KCR government) ప్రత్యేక చొరవతో ఐలమ్మ జీవిత చరిత్రను పాఠశాల విద్యలో పాఠ్యాంశంగా చేర్చారని గుర్తు చేశారు. పాలకుర్తి మార్కెట్ యార్డుకు ఐలమ్మ పేరు పెట్టారని, చిట్యాల ఐలమ్మ జయంతి, వర్ధంతి వేడుకలను అధికారికంగా నిర్వహించారని సూచించారు. చాకలి ఐలమ్మ జయంతి సందర్భంగా కేటీఆర్ ఘన నివాళులర్పించారు. చాకలి ఐలమ్మ జయంతి సందర్భంగా తెలంగాణ భవన్‌లో శాసనమండలి ప్రతిపక్ష నేత, ఇతర బీఆర్ఎస్ నాయకులు ఐలమ్మ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి, నివాళులు అర్పించారు.