9 May, 2026 | 10:44 AM

Breaking News

కొత్త సీడీఎస్‌గా రాజా సుబ్రమణి నియామకం   •   నేవీ చీఫ్‌గా వైస్ అడ్మిర‌ల్ కృష్ణస్వామినాథ‌న్ నియామ‌కం   •   గర్భం దాల్చిన మైనర్ బాలిక... యువకుడిపై కేసు నమోదు   •   కరీంనగర్‌లో టెన్షన్.. టెన్షన్.. మాజీమంత్రి గంగుల హౌస్ అరెస్ట్   •   తమిళనాడులో పొలిటికల్ సస్పెన్స్ థ్రిల్లర్.. అధికారానికి అడుగు దూరంలో విజయ్!   •   నామకరణ మహోత్సవంలో పాల్గొన్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్   •   ట్రిపుల్ ICG ఫ్లోరెసెన్స్ సాంకేతికతతో రోబోటిక్ ఈసోఫేజియల్ క్యాన్సర్ శస్త్రచికిత్సలో ప్రపంచస్థాయి ప్రమాణాన్ని నెలకొల్పిన హైదరాబాద్ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ (AOI)   •   రాష్ట్రంలో శాంతిభద్రతలు దిగజారాయి   •   తమిళనాట తికమక!   •   భయం అవుట్ భరోసా ఇన్   •  

నంబర్‌వన్ స్థానంలోనే బుమ్రా

22-01-2025 11:25 PM

ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్...

దుబాయ్: భారత స్పీడస్టర్ జస్‌ప్రీత్ బుమ్రా ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో నంబర్‌వన్ స్థానాన్ని నిలుపుకున్నాడు. బుధవారం ఐసీసీ విడుదల చేసిన ర్యాంకింగ్స్‌లో బుమ్రా టాప్‌లోనే కొనసాగుతుండగా.. ఆల్‌రౌండర్ల కేటగిరీలో భారత క్రికెటర్ రవీంద్ర జడేజా కూడా అగ్రస్థానాన్ని కాపాడుకున్నాడు. బౌలర్ల ర్యాంకింగ్స్‌లో బుమ్రా (907 పాయింట్లు) తొలి స్థానంలో ఉండగా.. ఆసీస్ పేసర్ కమిన్స్ (841 పాయింట్లు), రబాడ (837 పాయింట్లు) వరుసగా రెండు, మూడు స్థానాల్లో ఉన్నారు. స్వదేశంలో వెస్టిండీస్‌పై విజయంలో కీలకపాత్ర పోషించిన పాక్ బౌలర్ నొమన్ అలీ (761 పాయింట్లు) తొలిసారి టాప్ ప్రవేశించాడు. ఇక ఆల్‌రౌండర్ల ర్యాంకింగ్స్‌లో జడేజా (400 పాయింట్లు) టాప్ స్థానాన్ని కాపాడుకోగా.. మార్కో జాన్సెన్ (294), మెహదీ హసన్ (263) రెండో, మూడో స్థానాల్లో ఉన్నారు.