22-01-2025 11:29:23 PM
కేపీబీ ట్రస్ట్ వుమెన్స్ ఓపెన్...
బెంగళూరు: యూఎస్‌డీ 100,000 కేపీబీ ట్రస్ట్ వుమెన్స్ ఓపెన్‌లో భారత టెన్నిస్ స్టార్లు సహజ యమలపల్లి, అంకిత రైనా రెండో రౌండ్‌లో అడుగుపెట్టారు. బుధవారం జరిగిన మహిళల సింగిల్స్ తొలి రౌండ్‌లో రెండో సీడ్ సహజ 6 3 6 బ్రిటన్‌కు చెందిన యురికో లిలీపై విజయం సాధించింది. రెండో రౌండ్‌లో సహజ రష్యాకు చెందిన మారియా టిమొఫీవాతో తలపడనుంది. మరో మ్యాచ్‌లో భారత నంబర్‌వన్ అంకిత రైనా 7 (7/2), 7 (7/4)తో రష్యాకు చెందిన డారియా కుదషోవాపై థ్రిల్లింగ్ విజయాన్ని అందుకుంది. అయితే తర్వాతి రౌండ్‌లో అంకిత జర్మనీకి చెందిన టాప్ సీడ్ తటజనా మారియాను ఎదుర్కోనుంది. మిగిలిన మ్యాచ్‌ల్లో భారత వైల్డ్‌కార్డ్ ఎంట్రీలు వైదేహీ చౌదరీ, శ్రీవల్లి రష్మిక, రియా భాటియాలు ఓటమిపాలయ్యారు.