24 June, 2026 | 12:25 AM

Breaking News

నరకానికి నకలు.. కెల్లేడు రహదారి   •   గజ్వేల్ స్పోర్ట్స్ హబ్‌కు 27 ఎకరాలు కేటాయించాం   •   ప్రభుత్వ కళాశాలల్లో విద్యార్థుల సంఖ్య పెరగాలి   •   బీఎల్ఓ సర్ అవగాహన సదస్సును పాల్గొన్న ప్రభుత్వ సలహాదారులు   •   ప్రభుత్వ పాఠశాలలను కాపాడుకుందాం – ప్రైవేట్ పాఠశాలల ఆర్థిక దోపిడీని అరికడదాం: ఏబీవీపీ   •   కార్పొరేట్లకు రాయితీలు సామాన్యులపై భారాలు: సిపిఎం   •   వీబీజీ రామ్ జి చట్టాన్ని రద్దు చేసి గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం పునరుద్ధరించండి   •   28న పల్స్ పోలియో విజయవంతం చేయాలి   •   ఎబీవీపీ ఆధ్వర్యంలో పాఠశాలల బంద్ విజయవంతం   •   గుర్తుతెలియని వాహనం ఢీకొని వ్యక్తికి తీవ్ర గాయాలు   •  

బుమ్రాకు వీరాభిమానిని: ఆంబ్రోస్

21-06-2024 02:22 AM

బ్రిడ్జ్‌టౌన్: టీమిండియా క్రికెటర్ జస్‌ప్రీత్ బుమ్రాకు తాను వీరాభిమానినని విండీస్ దిగ్గజ క్రికెటర్ కర్ట్‌లీ ఆంబ్రోస్ పేర్కొన్నాడు. బుమ్రా బౌలింగ్ పూర్తి వైవిధ్యదతో కూడుకున్నదని.. దానిని మార్చుకోవాల్సిన అవసరం అతడికి లేదని అభిప్రాయపడ్డాడు. అఫ్గానిస్థాన్‌తో టీమిండియా మ్యాచ్‌కు సిద్ధమైన వేళ బుమ్రాపై ఆంబ్రోస్ ప్రశంసలు కురిపించాడు.‘జస్ప్రీత్ బుమ్రా.. టీమిండియాకు దొరికిన వరం. మ్యాచ్‌లో అత్యంత ప్రభావం చూపించగల క్రికెటర్. విభిన్నమైన బౌలింగ్ బుమ్రాను ప్రత్యేకంగా నిలబెట్టింది. ప్రస్తుతం అన్ని ఫార్మాట్లలో టీమిండియా విజయాల్లో కీలకపాత్ర పోషిస్తున్నాడు. పెద్ద గాయం బారిన పడితే తప్ప అతడు బౌలింగ్ శైలిని మార్చుకోవాల్సిన అవసరం లేదు. ఇదే ఒక అభిమానిగా అతడికి నేనిచ్చే సలహా’ అని ఆంబ్రోస్ వెల్లడించాడు.