calender_icon.png 14 November, 2025 | 9:02 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png
Breaking News

జడ్చర్ల లో ఓ ఇంట్లో దొంగతనం

29-07-2024 04:06:03 PM

5 తులాల బంగారు ఆభరణాలు చోరీ

జడ్చర్ల, జులై29(విజయక్రాంతి): జడ్చర్ల పట్టణం అయోద్యనగర్  కాలనీలో నివాసం ఉంటున్న ప్రవీణ్ రెడ్డి ఇంట్లో భారీ చోరీ జరిగింది. ఆదివారం అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు ఇంట్లోకి జొరబడి 5తులాల బంగారం, 50తులాల వెండి, 15 వేయిలా రూపాయల నగదు ఎత్తుకెళ్లిన ఘటన చోటుచేసుకుంది. సోమవారం ఉదయం బాధితుడి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు ఘటన స్థలంలో విచారణ చేపట్టారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు