16 May, 2026 | 7:30 PM

రోడ్డు రోలర్ తో మోటార్ సైలెన్సర్ల దగ్ధం

04-02-2025 11:01 PM

కామారెడ్డి (విజయక్రాంతి): కామారెడ్డి  జిల్లా కేంద్రంలోని ఇందిరా చౌక్ సమీపంలో అధికంగా శబ్దం చేస్తూ, కాలుష్యాన్ని కలిగించే మోటార్ సైకిల్ వాహనాలను మంగళవారం ఏ ఎస్ పి చైతన్య రెడ్డి ఆధ్వర్యంలో రోడ్డు రోలర్ తో దగ్ధం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... గత నెల, రెండు నెలల నుండి కామారెడ్డి పట్టణంలోని వివిధ ప్రాంతాలలో అధికంగా శబ్ద కాలుష్యాన్ని కలిగించే మోటార్ సైకిల్ యొక్క సైలెన్సర్లను తీసి, వాటి యజమానులపై మోటార్ వాహనాల చట్టానికి అనుగుణంగా కేసులు నమోదు చేసి, అట్టి వాహనాల నుంచి 65 సైలెన్సర్లను సీజ్ చేసినట్లు తెలిపారు.

అధిక శబ్దాన్ని ఇచ్చే సైలెన్సెర్ లను వాడటం వల్ల ప్రజలకు తీవ్ర ఇబ్బందులు కలుగుతాయని, శబ్ద కాలుష్యం చేయకూడదన్నారు., పట్టణములో,ఇతర ప్రాంతాలలో అ ధిక శబ్ద కాలుష్యాన్ని కలిగించే మాడిఫైడ్ సైలెన్సర్లను వాడిన యెడల కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పట్టణ సీఐ  చంద్రశేఖర్ రెడ్డి, ఎస్ఐ శ్రీరామ్, ట్రాఫిక్ ఎస్ఐ మహేష్, సిబ్బంది పాల్గొన్నారు.