టిప్పర్ లారీ ఢీ... మహిళ మృతి
16-05-2026 07:21 PM
ఆలేరు,(విజయక్రాంతి): రోడ్డు ప్రమాదంలో ఓ మహిళ మృతి చెందిన విషాద సంఘటన యాదాద్రి భువనగిరి జిల్లా మోటకొండూర్ మండలం ఆరెగూడెం గ్రామానికి చెందిన బరిగెల నర్సింహ్మ తన భార్య నవనీత(48)తో కలిసి ద్విచక్ర వాహనంపై భువనగిరి వైపు వెళ్తుండగా మార్గమధ్యంలో మాసుకుంట సమీపంలో వెనుక నుంచి వచ్చిన టిప్పర్ లారీ వారిని ఢీకొట్టినట్లు స్థానికులు తెలిపారు. ఈ ప్రమాదంలో నవనీత తలకు తీవ్ర గాయాలతో, ఘటన స్థలంలోనే ఆమె మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు, నర్సింహ్మకు గాయాలైనట్లు తెలిపారు, సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు పోలీసులు తెలిపారు.






