16 May, 2026 | 8:16 PM

పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత..

16-05-2026 07:29 PM

- బాన్సువాడ డివిజనల్ అటవీ అధికారిణి సునీత..

గాంధారి,(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా గాంధారి మండలం లోని నాగ్లూర్ తండా వాసులతో పర్యావరణ పరిరక్షణ పై సమావేశం నిర్వహించినట్టు గాంధారి అటవి రేంజ్ అధికారిణి హిమ చందన తెలిపారు. ఈ సమావేశానికి బాన్సువాడ డివిజనల్ అటవీ అధికారిణి సునీత హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అటవీ భూముల్లో గల చెట్లను పరిరక్షించుకోవడం ప్రతీ ఒక్కరి బాధ్యత అని లేకపోతే భావి తరాలు పలు రకాల సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది అని అన్నారు. అడవులు నరకడం వలన వర్షాలు కురవక రైతులు పంట పండించడం చాలా కష్టం అవుతుంది అని ఆమె అన్నారు.. వచ్చే వర్షాకాలం దృష్టా ప్రతి ఒక్కరు చెట్లు నాటాలి అని , చెట్లను నరకకూడదు అని ఆమె అన్నారు.. అడవుల్లో చెట్లు పెరిగితే కోతులు వాటి ఆహారం  కొరకు ఊర్లలోకి రావు అని అన్నారు.