23 July, 2026 | 1:39 AM

రాహుల్ గాంధీ దిష్టిబొమ్మ దహనం

23-07-2026 01:08 AM

ముకరంపురా,జూలై22(కరీంనగర్): కరీంనగర్‌లో బిజేపీ ఎం పి కార్యాలయంపై దాడి, ఢిల్లీలో కాంగ్రెస్ చేపట్టిన నిరసనలకు వ్యతిరేకంగా కరీంనగర్లో బీజేపీ నాయకులు, కార్యకర్తలు బుధవారం రాహుల్‌గాంధీ దిష్టిబొమ్మను దహనం చేశారు.

ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీకి వ్యతిరే కంగా నినాదాలు చేశారు. కాంగ్రెస్ దేశంలో అశాంతి సృష్టించే రాజకీయాలకు పాల్పడుతోంద ని బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వంపై కాంగ్రెస్ చేస్తున్న ఆరోపణలను ప్రజలు నమ్మబోరని, ఇటువంటి రాజకీయాలకు తగిన గుణపాఠం చెబుతారని ఆయన అన్నారు. కార్యక్రమంలో బీజేపీ ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.