27 February, 2026 | 12:12 PM

గుమ్మిర్యాల్ నుంచి జేబీఎస్‌కు బస్సు సౌకర్యం

27-02-2026 12:00 AM

ఏర్గట్ల, పిబ్రవరి 26 (విజయ క్రాంతి): గుమ్మిర్యాల్ నుండి హైదరాబాద్ జెబిఎస్ వరకు బస్సు సౌకర్యం పునరద్ధన కోసం ప్రయత్నం చేయడంతో ఫలితాన్ని ఇచ్చిందని భట్టాపూర్ ఉపసర్పంచ్ మూడు దయానంద తెలిపారు. తమ గ్రామల యువకులు, హైదరాబాద్‌లో చదువుకునే విద్యార్థులు, వైద్యం కోసం హైదరాబాద్ వెళ్లే వారు తనను కలసి బస్సు సౌకర్యంపై ఫిర్యాదు చేయడంతో అధికారుల దృష్టికి ఈ విషయం తీసుకెళ్లడంతో సత్ఫలితం దక్కింది అన్నారు. 

పిబ్రవరి 7న అర్ముర్ డిపో మేనేజర్‌ను కలిసి  వినతి పత్రం అందజేశానని దయానంద్ తెలిపారు. వినతి పత్రం అందజేసి ఏర్గట్ల మండలం తోపాటు చుట్టూ ప్రక్క గ్రామాల నుండి వచ్చే ప్రయాణికుల కు ఈ బస్సు వలన కలిగే ఉపయోగం గురించి వివరించడంతో అధికారులు ఆమోదం తెలిపారు అన్నారు. పదిహేను రోజుల్లో బస్సును ప్రారంభిస్తామని ఇచ్చిన హామీ మేరకు బస్సును ప్రారంభించారని సంతోషం వ్యక్తం చేశారు.

డిఏం ఇచ్చిన మాట ప్రకారం ఈ నేల 25న ఆర్మూర్ బస్టాండ్ వద్ద ఏర్గట్ల ఉపసర్పంచ్ సున్నపు లక్ష్మి శ్రీనివాస్, స్టేషన్ మేనేజర్ యాదగిరి, సిబ్బంది తో కలిసి కొబ్బరికాయ కొట్టి బస్సును ప్రారంభించినట్లు ఆయన తెలిపారు.బస్సు నిర్మల్ జిల్లా మామడ మండలం పొనకల్ గ్రామం నుండి ఉదయం 4:30 గంటలకు బయలు దేరి గుమ్మిర్యాల్, దొంచంద, తాళ్ళ రాంపూర్, ఏర్గట్ల మీదుగా తిమ్మాపూర్, పాలెం మీదుగా మోర్తాడ్, ఆర్మూర్ నుండి హైదరాబాద్   జె బి ఎస్  బస్టాండ్ కి ఉదయం 10 గంటల వరకు వరకు వెళ్తుందని,

మల్లి హైదరాబాద్ జేబీఎస్ నుండి 11 15 నిమిషాలకు  ఆర్మూర్ కి బయలుదేరి సాయంత్రం నాలుగు గంటల లోపు ఆర్మూర్ చేరుకుంటుందని, మళ్లీ ఆర్మూర్ నుండి నుండి రాత్రి 8:30 కు బయలు దేరి నైట్ హల్ట్  కోరకు పొనకల్ గ్రామానికి రాత్రి పది గంటలకు చేరుకుంటుంది,ఏర్గట్ల మండలంలోని అన్ని గ్రామాల ప్రజలతో పాటు ప్రక్క మండలం ముప్కాల్,సావెల్, ఇబ్రహీంపట్నం మండలాల ప్రజలు ఈ బస్సు సౌకర్యాన్ని సద్వినియోగం  చేసుకోవాలని భట్టాపూర్ ఉప సర్పంచ్ దయానంద్ తెలిపారు.