27 February, 2026 | 12:12 PM

కామారెడ్డిలో స్వార్థ రాజకీయాల కోసమే రచ్చ

27-02-2026 12:00 AM

జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు 

కామారెడ్డి, ఫిబ్రవరి 26 (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఇటీవల జరుగుతున్న రచ్చ కేవలం రాజకీయ స్వార్థం కోసమే నని జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు అన్నారు. కామారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆస్తుల వ్యాయామం గత కొన్ని సంవత్సరాల నుంచి జరుగుతుందని ఆ విషయం ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల తర్వాత రావడం చూస్తుంటే జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీల్లో బిజెపి స్థానాలు గెలువక పోవడం వల్లే ఉనికి కోసం రచ్చ చేస్తున్నారని మండిపడ్డారు.

నిజంగా కళాశాల ఆస్తుల మీద ప్రేమ ఉంటే కళాశాల అభివృద్ధి కమిటీల మెంబర్గా ఉన్న కామారెడ్డి ఎమ్మెల్యే విద్యార్థి సంఘాల నాయకులకు కళాశాల ఆస్తుల గురించి పూర్తి వివరాలు తెలుసా అని రచ్చ చేసుకోవడం ఎందుకని కేవలం ప్రజల ముందు కాకుండా పత్రిక ప్రతినిధులను ముందు పెట్టి కళాశాల ఆస్తుల వివరాలను ప్రకటిస్తే సరిపోలేదని కేవలం రాజకీయ లబ్ధి కోసం ప్రజలను రెచ్చగొట్టడం కార్యకర్తలు రెచ్చగొట్టి రాజకీయంగా లబ్ధి పొందేందుకే బిజెపి నాయకులు రాద్దాంతం చేశారన్నారు. జుక్కల్ నియోజకవర్గం లో శాశ్వత తాగునీటి సమస్య పరిష్కారం కోసం ప్రత్యేక కృషి చేస్తున్నట్లు చెప్పారు.

మహారాష్ట్రలోని లెండి ప్రాజెక్టు నిర్మాణం పూర్తయితే 40 వేల మెట్రిక్ ఎకరాల కు సాగునీరు అందుతుందని, నాగమడుగు ఎత్తిపోతల పథకం పూర్తి అయితే 30 వేల మెట్రిక్ ఎకరాల భూములు సస్యశ్యామలమవుతాయని జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు తెలిపారు. ఇప్పటికే మహారాష్ట్ర, తెలంగాణ రాష్ట్ర ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించినట్లు తెలిపారు.

ఇరు రాష్ట్రాలు నిధులు మంజూరు చేస్తే పనులు పూర్తయి భూములు శాశ్వతంగా సస్య శ్యామలమవుతాయని తెలిపారు. తాత్కాలిక పనుల కంటే శాశ్వతంగా ప్రజలకు ఉపయోగపడే పనులు పూర్తిచేస్తే ప్రజల గుండెల్లో నిలిచిపోతామని అన్నారు. జుక్కల్ నియోజకవర్గాన్ని ఆదర్శవంతమైన నియోజకవర్గంగా తీర్చిదిద్దుతానాన్ని తెలిపారు. అనంతరం జిల్లా కలెక్టర్ ఆశిష్ సంఘవాన్ని కలెక్టరేట్లో కలిసి పలు అభివృద్ధి పనుల పై చర్చించారు.

తంలో రూర్బన్ పథకం కింద చేపట్టిన పనులు, మిగిలిపోయిన పనులతో పాటు, కౌలాస్, నిజాంసాగర్ ప్రాజెక్టుల వద్ద టూరిజం డెవలప్మెంట్ కోసం స్థలాలు అప్పగించామని నిధులు మంజూరు చేసి పనులు ప్రారంభించాలని కోరినట్లు ఎమ్మెల్యే తెలిపారు. రాష్ట్ర టూరిజం మంత్రి తోపాటు ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి నియోజక వర్గ సమస్యలను వివరించినట్లు తెలిపారు.