18 April, 2026 | 6:29 AM

బస్‌పాస్ చార్జీలను తగ్గించాలి

11-06-2025 01:02 AM
  1. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత డిమాండ్

బస్ భవన్ ముట్టడికి యత్నం

అరెస్టు చేసిన పోలీసులు

తెలంగాణ జాగృతి నాయకుల అరెస్ట్

ముషీరాబాద్, జూన్ 10 (విజయక్రాంతి): రాష్ట్ర ప్రభుత్వం పెంచిన బస్‌పాస్ చార్జీలను తగ్గించాలని ఎమ్మెల్సీ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. బస్‌పాస్ చార్జీలను పెంచడాన్ని నిరసిస్తూ మంగళవారం తెలంగాణ జాగృతి నాయకులు, కార్యకర్తలతో కలిసి కవిత ఆధ్వర్యంలో బస్‌భవన్‌ను ముట్టడించారు.

పోలీసులు అడ్డగించడంతో బస్ భవన్ ఎదుటే బైఠాయించారు. దీంతో ఎమ్మెల్సీ కవితతో పాటు తెలంగాణ జాగృతి నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కవితను కంచన్ బాగ్ పోలీస్ స్టేషన్‌కు, జాగృతి నాయకులను చాంద్రాయణగుట్ట పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

అనంతరం ఎమ్మెల్సీ కవిత మీడియాతో మాట్లాడుతూ.. విద్యార్థులపై పెను భారం మోపేలా ఒకేసారి 50 శాతం చార్జీలు పెంచ డం దారుణమన్నారు. చార్జీల పెంపుతో ఒ క్కో ప్రయాణికుడిపై సగటున నెలకు రూ. 300లకు పైగా భారం పడుతుందన్నారు. ప్రజలను ప్రభుత్వం పీల్చిపిప్పి చేస్తుంటే తాము చూస్తూ ఊరుకోబోమని, ప్రజల పక్షాన ఉద్యమిస్తూనే ఉంటామన్నారు.