18 April, 2026 | 4:42 AM

భలే ఐడియా!

11-06-2025 01:03 AM

ట్రాన్సిట్ మిక్సర్ ట్యాంక్ కి కృత్రిమ చల్లదనం

 మహబూబాబాద్,  విజయక్రాంతి); సిమెంట్ కాంక్రీట్ మిక్సింగ్ యూనిట్ నుంచి వివిధ నిర్మాణ పనులకు మిక్సింగ్ సిమెంట్ కాంక్రీట్ ను రవాణా చేసే వాహన ట్యాంకుల్లో  సిమెంట్ ఎండ తీవ్రతకు గడ్డ కడుతుండడంతో ట్యాంకును చల్లబరిచేందుకు ‘భలే ఐడియా’ కనిపెట్టారు. ట్రాన్సిట్ మిక్సర్ వాహనం ట్యాంకర్ చుట్టూ గన్ని బస్తాలతో చుట్టి నీటిని చల్లి గమ్యస్థానానికి గడ్డ కట్టకుండా సిమెంటు తరలిస్తున్నారు.

ఇటీవల ఎండ తీవ్రత అధికంగా మారడంతో మహబూబాబాద్ జిల్లా పరిసర ప్రాంతాల్లో నిర్వహిస్తున్న రైల్వే మూడో లైన్, గ్రీన్ ఫీల్ హైవే పనులకు ఇతర ప్రాంతాల నుండి కాంక్రీట్ సిమెంట్ ను ట్రాన్సిట్ మిక్సర్ ట్యాంకుల్లో తెస్తున్నారు. అయితే 20 నుంచి 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న సిమెంటు మిక్సింగ్ యూనిట్ నుంచి యంత్రాలు వస్తుండగా ఎండ తీవ్రతతో ట్యాంకర్ లో సిమెంట్ కాంక్రీట్ గడ్డ కడుతుండడంతో చల్లబరిచేందుకు ఈ చిట్కాను వినియోగించడం వల్ల సిమెంటు గడ్డ కట్టడం లేదని చెబుతున్నారు.