28 June, 2026 | 11:52 AM

రవాణాశాఖలో ఏజెంట్ల మాటేమిటి?

25-05-2024 12:05 AM

రాష్ట్ర ప్రభుత్వం డ్రైవింగ్ లైసెన్స్ శిక్షణ నిబంధనలను సవరిస్తూ ప్రైవేటు సంస్థలకూ అవకాశం కల్పించడం వల్ల ఒక విధంగా మేలు జరుగుతుంది. ప్రాంతీయ రవాణా శాఖ కార్యాలయాలకు వెళ్లి డ్రైవింగ్ టెస్టులలో పాల్గొనాల్సిన బాధ తప్పుతుంది. దీనిద్వారా చాలామందికి లైసెన్సు పొందే అవకాశం లభిస్తుంది. అయితే, రవాణా శాఖలో పాతుకుపోయిన అనధికారిక ఏజెంట్ల వ్యవస్థకు ఈ చర్య మరింత ఊతమిచ్చినట్టు అవుతుంది. ఖర్చు తడిసి మోపెడవుతుంది.

 -రవీందర్‌రెడ్డి, మహబూబ్‌నగర్