డిపోలకే పరిమితమైన బస్సులు
- రెండో రోజూ కొనసాగిన ఆర్టీసీ కార్మికుల సమ్మె
- పోలీసుల భద్రతతో కొన్నిచోట్ల నడిచిన బస్సులు
- ప్రయాణికులకు తప్పని ఇబ్బందులు
హైదరాబాద్, ఏప్రిల్ 23 (విజయక్రాంతి): రెండో రోజూ ఆర్టీసీ సమ్మె రాష్ట్రవ్యాప్తంగా కొనసాగింది. దీంతో బస్సులు దాదాపుగా డిపోలకే పరిమితయ్యాయి. కొన్ని చోట్ల మాత్రం అద్దె బస్సులు నడిచాయి. కార్మికులు అడ్డుకోకుండా పోలీసు భద్రత నడుమ బస్సులను నడిపించారు. బుధవారం నాటి కంటే గురువారం అక్క డక్కడ బస్సులు కనిపించాయి. హైదరాబాద్‌తోపాటు జిల్లాల్లో ఆర్టీసీ యాజమాన్యం అద్దె బస్సులను రోడ్డెక్కించింది.
ఎంజీబీఎస్, జేబీఎస్ నుంచి ఆర్టీసీ బస్సులు రోడ్డెక్కలేదు. సమ్మె విష యం తెలియక ప్రయాణికులు బస్సుల కోసం బస్టాండ్‌లకు వచ్చారు. గంటల తరబడి వేచి చూశారు. వచ్చిన ఒకట్రెండు బస్సులు కూడా జనంతో నిండిపోతున్నాయి. దీంతో చేసేది లేక ప్రయాణికులు ప్రైవేట్ ట్రావెల్స్, ఆటోలు, క్యాబ్‌లను ఆశ్రయించారు. ఎంజీబీఎస్ నుంచి ఏపీ, కర్ణాటక, మహారాష్ట్రకు చెందిన బస్సులు నడిచా యి.
రోజూవారి పనులు చేసుకునేవారు, దినసరి కూలీలు, వ్యాపారులు, ఉద్యోగులు, విద్యా ర్థులు బస్సుల్లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. జేఏసీ ఇచ్చిన పిలుపు మేరకు రాష్ట్రవ్యా ప్తంగా డిపోల వద్ద ధర్నా కార్యక్రమాలను ఆర్టీసీ కార్మికులు చేపట్టారు. కొన్ని డిపోల వద్ద కార్మికులు వేసిన టెంట్లను పోలీసులు తొలగించినట్టు జేఏసీ నేతలు తెలిపారు.
40 వేలు పెరిగిన మెట్రో రద్దీ
ఆర్టీసీ సమ్మె ప్రభావంతో హైదరాబాద్‌లో మెట్రోపై ఒత్తిడి పెరిగుతున్నది. ప్రయాణికుల సంఖ్య సాధారణ రోజుల కంటే దాదాపు 40 వేలకు పెరిగినట్టు మెట్రో అధికారులు తెలిపారు. సాధారణ రోజుల్లో 4.30 లక్షల మంది నిత్యం మెట్రోలో ప్రయాణిస్తుండగా, సమ్మె రోజుల్లో దీ నికి అదనంగా దాదాపు 40 వేల మంది ప్రయాణిస్తున్నట్టు వివరించారు. మెట్రోపై పెద్దగా ప్ర యాణికుల ఒత్తిడి లేదని అధికారులు చెప్తున్నారు. నగరంలో ఆటో, క్యాబ్ సర్వీసులు అం దుబాటులో ఉండటంతో ప్రయాణికుల తాకిడి పెద్దగా లేదని పేర్కొంటున్నారు.






