calender_icon.png 4 February, 2026 | 6:52 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలి

04-02-2026 01:17:30 AM

  1. ఎమ్మెల్యే గడ్డం వినోద్, డీసీసీ ప్రెసిడెంట్ రఘునాథరెడ్డి పిలుపు
  2. కాంగ్రెస్ అభ్యర్థు జాబితా వెల్లడి 
  3. బీఫారంల అందజేత

బెల్లంపల్లి, ఫిబ్రవరి 3:  బెల్లంపల్లి మున్సిపల్ అభివృద్ధి కోసం ప్రజలు కాంగ్రెస్ పార్టీని అధిక మెజారిటీతో గెలిపించాలని బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్, డీసీసీ ప్రెసిడెంట్ పి రఘునాథ్ రెడ్డి అన్నారు. బెల్లంపల్లి క్యాంపు కార్యాలయంలో మంగళ వారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. మునిసిపల్ ఎన్నికల కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల జాబితాను ప్రకటించారు.

ఈ సందర్భంగా అభ్యర్థులకు పార్టీ బీ ఫామ్‌లు అప్ప గించి అనంతరం మాట్లాడారు. బెల్లంపల్లి పట్టణాన్ని రూ. 100 కోట్లతో  కనివిని ఎరగని రీతిలో అభివృద్ధి చేయడానికి ప్రణాళికలు రెడీ చేసుకున్నామన్నారు. ఇప్పటికే నియోజక వర్గంలో కోట్లాది రూపాయలతో అభివృద్ధి పనులు చేపట్టామన్నారు. రోడ్ల అభివృద్ధి పనులు రూ. 18 కోట్లు, ఇంటిగ్రేటెడ్ స్కూల్ కు రూ. 200 కోట్లతో ఇటీవలే శంకుస్థాపన చేసుకున్నామన్నారు.

ఇలాంటి పాఠశాలను ఇంత వరకు ఎవరూ తేలేదన్నారు. గత పాలకులు అభివృద్ధిని పట్టించుకోలేదని ఆరోపిం చారు. తన మూడు సంవత్సరాల పదవి కాలంలో పెండింగ్లో ఉన్న అభివృద్ధి కార్యక్రమాలు అన్నిటిని పూర్తి చేసి బెల్లంపల్లి అభివృద్ధిలో అగ్రస్థానంలో నిలుపుతానన్నారు. ప్రజలిచ్చిన ఆశీర్వాదం తో బెల్లంపల్లి అభివృద్ధికి కట్టుబడి పని చేస్తున్నారన్నారు.

మున్సిపల్ ఎన్నికల్లో కూడా ప్రజలు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. అభివృద్ధి చేసే ప్రభుత్వాన్ని స్థానిక సంస్థల్లో నిలబెట్టాలన్నారు. స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి పట్టం కడితే బెల్లంపల్లి మున్సిపాలిటీ అభివృద్ధి పథంలో మొదటి స్థానంలో నిలబెడుతామన్నారు. 

అధిష్టానం నిర్ణయం మేరకే అభ్యర్థుల ఎంపిక..

మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల ఎంపిక అధిష్టానం గైడ్ లెన్స్, అభ్యర్థుల పై ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక జరిగిందనీ డీ సీసీ అధ్యక్షుడు పి రఘునాథరెడ్డి, ఎమ్మెల్యే గడ్డం వినోద్ స్పష్టం చేశారు. 34 వార్డులకు ఆశావాహుల నుంచి నామినేషన్లు రెట్టింపు స్థాయిలో వచ్చాయన్నారు. అభ్యర్థుల లిస్టును అధిష్టానానికి పంపించామన్నారు. ఎన్నికల్లో సమర్థవంతమైన అభ్యర్థులను అధిష్టానం  ఖరారు చేసి జాబితాను తమకు అప్పగించిందన్నారు.

అధిష్టానం నిర్ణయం మేరకే అభ్యర్థుల ఎంపిక జరిగిందన్నారు. ఎలాంటి అవకతవకలు, ప్రలోభాలకు అతీతంగా పారదర్శకంగా జాబితా రూపకల్పన జరిగిందన్నారు. ప్రతి ఒక్కరిలో పోటీ చేయాలని ఆసక్తి ఉండటంలో తప్పు లేదన్నారు. సరైన అభ్యర్థుల పరిశీలన మేరకే తుది జాబితాను అధిష్టానం ఫైనల్ చేసిందన్నారు. టికెట్ కోల్పోయిన ఆశాభావులకు వారీ వారీ సామర్థ్యం, అర్హతలను బట్టి నామినేటెడ్,కార్పొరేషన్ పదవులను అప్పగిస్తామన్నారు.

అధిష్టానం వారి సేవలను అభివృద్ధిలో భాగస్వామ్యం చేసేందుకు నామినేటెడ్ పదవుల్లో నియమించి న్యాయం చేసేందుకు అధిష్టానం సిద్ధంగా ఉందన్నారు. పార్టీ టికెట్ ఇచ్చిన అభ్యర్థులను,గెలిపించేందుకు అభ్యర్థిత్వం కోల్పోయిన  నాయకులు బాధ్యత తీసుకోవాలన్నారు. పార్టీ విజయానికి విభేదాలను పక్కనపెట్టి సమన్వయంతో కృషి చేయాలని పిలుపునిచ్చారు. పాత కొత్త నాయకులను కలుపుకొని బెల్లంపల్లి మున్సిపాలిటిపై విజయకేతనం ఎగరవేసే లక్ష్యంతో పనిచేయాలన్నారు. ఈ సమావేశంలో బెల్లంపల్లి పట్టణ అధ్యక్షుడు ముచ్చర్ల మల్లయ్య పాల్గొన్నారు.

బెల్లంపల్లి మున్సిపాలిటీలో 173 మంది బరిలో...

బెల్లంపల్లి మున్సిపాలిటీలో వివిధ పార్టీలు బీ ఫారంలు అందజేసిన అనంతరం, అభ్యర్థుల బుజ్జగింపుల తర్వాత పార్టీల నుంచి, ఇండిపెండెంట్లు 173 మంది బరిలో ఉన్నారు. మున్సిపాలిటీ పరిధిలోని 34 వార్డులకు 252 మంది అభ్యర్థులు వేసిన 279 నామినేషన్లు ఆమోదం పొందాయి. మంగళ వారం ఆయా పార్టీల బీ ఫారంలు అందజేత, కొందరు విత్ డ్రా అనంతరం 79 మంది విత్ డ్రా చేసుకోగా 173 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు.

ఇందులో కాంగ్రెస్ నుంచి 34 మంది అభ్యర్థులు, బీఆర్‌ఎస్ నుంచి 34, బీజేపీ నుంచి 20, బీఎస్పీ నుంచి ఆరుగురు, ఏఐఎంఎం నుంచి ఇద్దరు, ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ (ఏఐఎ ఫ్బీ) నుంచి ఒకరు, సీపీఐ నుంచి ఆరుగురు, జనసేన నుంచి ఒక్కరు, ఇతర గుర్తింపు పొంది న పార్టీల నుంచి ముగ్గురు, ఇండిపెండెంట్లు 66 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు.