20 May, 2026 | 3:19 AM

బోధన్‌లో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో మజ్జిగ పంపిణీ

20-05-2026 01:06 AM

బోధన్, మే 19(విజయక్రాంతి): బోధన్ పట్టణంలోని కొత్త బస్టాండ్ వద్ద మంగళవారం మధ్యాహ్నం ప్రజలకు ఉచిత మజ్జిగ పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. పెరుగుతున్న ఎండల తీవ్రతను దృష్టిలో ఉంచుకుని ప్రయాణికులు, కార్మికులు మరియు స్థానిక ప్రజలకు మజ్జిగ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో 13వ వార్డు కౌన్సిలర్ పాల్గొని ప్రజలకు వేసవి జాగ్రత్తలపై అవగాహన కల్పించారు.

ప్రస్తుతం ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవుతున్న నేపథ్యంలో అవసరం లేకుండా బయట తిరగవద్దని సూచించారు. ఉదయం 11 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు ఎండలో సంచరించకుండా జాగ్రత్తలు పాటించాలని, అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే బయటకు రావాలని తెలిపారు. అలాగే ప్రజలు ఎక్కువగా నీరు, మజ్జిగ, పండ్ల రసాలు తీసుకోవడం ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ సభ్యులు, స్థానిక ప్రముఖులు తదితరులు పాల్గొన్నారు.