20 May, 2026 | 2:13 AM

నిధులను విడుదల చేయాలని వినతి

20-05-2026 01:04 AM

నాగిరెడ్డిపేట్,మే 19 (విజయక్రాంతి): గ్రామ పంచాయతీలకు రావాల్సిన నిధులు విడుదల చేయాలని ఎంపీడీవో ప్రవీణ్ కుమార్ కు వివిధ గ్రామాల సర్పంచులు వినతిపత్రం అందజేశారు. ఇందిరమ్మ కమిటీ సభ్యులుగా గ్రామ సర్పంచ్లకు ఇవ్వాలని కోరారు. 

గ్రామపంచాయతీలకు  2026-27 ఆర్థిక సంవత్సరంకు రావలసిన ఉపాధి హామీ నిధులను విడుదల చేసి గ్రామ అభివృద్ధి పనులకు సహకరించవలసిందిగా కోరారు. ఇందిరమ్మ కమిటీని రద్దు చేసి పూర్తి బాధ్యతలను గ్రామ పాలకవర్గం నిర్ణయించిన నిరుపేదలకే ఇందిరమ్మ ఇండ్లను ఇవ్వాలని కోరారు. ఎనిమిది గ్రామపంచాయతీలలో మాల్తుమ్మెద, వాడి,బంజర తండా, మెల్లకుంట తండా, బెజ్గం చెరువు తండా, చిన్న ఆత్మకూర్, ధర్మారెడ్డి, కన్నారెడ్డి గ్రామాలకు సకాలంలో పెండింగ్ నిధులు అందకపోవడం వల్ల 8 గ్రామాల్లో అత్యంత అవసరమైన, ప్రాధాన్యత కలిగిన పలు అభివృద్ధి కార్యక్రమాలు పూర్తి చేయలేకపోతున్నామని తెలిపారు.

ముఖ్యంగా గ్రామ ప్రజల రవాణా, ఆరోగ్య సౌకర్యాలకు సంబంధించిన కొత్త సిసి రోడ్ల నిర్మాణం, మురికి నీటి పారుదల కొరకు చేపట్టవలసిన కొత్త డ్రైనేజీ పనులు అర్ధాంతరంగా ఆగిపోయాయని, దీనివల్ల గ్రామస్తులు ముఖ్యంగా వర్షాకాలం సమీపిస్తున్న తరుణంలో ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటున్నామన్నారు. సర్పంచులు వంశీకృష్ణ గౌడ్, పుప్పాల సాయిలు, మహేందర్, సురేష్, బాల్యనాయక్, భాస్కర్, అనిత లచ్చయ్య, లక్ష్మీనారాయణ, సాయిలు ఉన్నారు.