calender_icon.png 21 November, 2025 | 3:33 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రమాదాల నిలయంగా బైపాస్ రోడ్డు!

21-11-2025 12:29:18 AM

  1. నిత్యం వందలాది వాహనాల రాకపోకలు
  2. నిర్లక్ష్యంగా నడిపిస్తున్న క్రషర్ టిప్పర్లు
  3. బలవుతున్న నిండుప్రాణాలు
  4. కనిపించని పోలీసుల పర్యవేక్షణ

అమీన్ పూర్, నవంబర్ 20 :రీజనల్ రింగ్ రోడ్డుకు ఇరువైపులా ఏర్పాటు చేసిన బైపాస్ రోడ్డు ప్రమాదాలకు నిలయంగా మారుతోంది. నిత్యం వందలాది వాహనాలు ఈ రోడ్డు గుండా ప్రయాణిస్తుంటా యి. ఎందరో ఉద్యోగులు తమ కార్యాలయాలకు, విద్యార్థులు పాఠశాలలకు వెళ్తుంటారు. అయితే బైపాస్ రోడ్డుపై పోలీసుల నియంత్రణ లేకపోవడంతో అతి వేగంగా వాహనా లను నడుపుతూ ప్రమాదాలకు కారణమవుతున్నారు.

సమీపంలోని స్టోన్ క్రషర్లకు చెందిన టిప్పర్లు, భారీ లారీలు వేగంగా రావడంతో పలు ప్రమాదాల్లో మృత్యువాత ప డ్డారు. అమీన్ పూర్ మున్సిపల్ పరిధిలోని కిష్టారెడ్డిపేట ఓఆర్‌ఆర్ వద్ద తరచూ ప్రమాదాలు జరుగుతున్నా అధికారులు పట్టిం చుకోవడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. ఈ సర్కిల్ లో ప్రాణాలు కూడా పోయాయని చెబుతున్నారు.

ఉదయం, సాయంత్రం పాఠశాల విద్యార్థులు, ఉద్యోగస్తులు ప్రాంతంలో రాకపోకలు సాగిస్తున్నారు. క్రషర్ నుండి వచ్చే వాహనాలు, మెడికల్ డివైస్ పార్క్ నుండి వచ్చే వాహనాలు ఎగ్జిట్ నంబర్ 4 నుండి ఓఆర్‌ఆర్ పైకి వెళ్తుంటాయి. దీంతో ఈ ప్రాంతం రద్దీగా ఉంటుంది. జంక్షన్ కావడంతో ఎప్పుడు ఏ ప్రమాదం జరుగు తుం దో అని ప్రయాణికులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని ప్రయాణించే పరిస్థితి ఏర్పడుతుందని వాపోతున్నారు. 

కనిపించని పోలీసుల పర్యవేక్షణ...

సుల్తాన్పూర్ ఓఆర్‌ఆర్ ఎగ్జిట్ నవంబర్ 4వ జంక్షన్ వద్ద నిత్యం వందలాది వాహనాలు ప్రయాణించడం వల్ల రద్దీగా ఉంటుం ది. అయితే ఇక్కడ వాహనాలను నియంత్రించేందుకు ఎలాంటి సిగ్నల్ కానీ, పోలీసుల పర్యవేక్షణ గానీ లేకపోవడంతో ఇష్టారీతిగా టిప్పర్లు, లారీలు, ఇతర వాహనాల వేగానికి అడ్డూఅదుపు లేకుండా పోతుంది. దీంతో ఈ ప్రాంతంలో పలుమార్లు ప్రమాదాలు జరిగాయి.

మెడికల్ డివైజ్ పార్క్ ఉద్యోగస్తులు పటాన్ చెరు, సంగారెడ్డి, అమీన్ పూర్ వివిధ ప్రాంతాల నుండి ఈ రోడ్డుపై ప్రయాణిస్తారు. ఈ ఎగ్జిట్ రోడ్డుకు దగ్గరలోనే స్టోన్ క్రషర్లు ఉండడం వల్ల టిప్పర్లు అధికలోడుతో ప్రయాణిస్తున్నాయి. చుట్టుపక్కల పలు పాఠశాలలు ఉండడంతో విద్యార్థులు ప్రయాణిస్తున్నందున పోలీసుల పర్యవేక్షణ ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.