calender_icon.png 21 November, 2025 | 4:48 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కాంగ్రెస్‌లో జూబ్లీ జోష్

21-11-2025 12:46:51 AM

  1. పల్లెల్లో ఎన్నికల సందడి

పార్టీ పరంగా 42 శాతం  ఇవ్వడానికి కాంగ్రెస్ సిద్ధం

కరీంనగర్, నవంబర్20(విజయక్రాంతి): జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో విజయం సాధించిన కాంగ్రెస్ పార్టీ పంచాయతీ ఎన్నికల్లో స త్తా చాటేందుకు సిద్ధమవుతుంది జూబ్లీ జోష్ తో పార్టీ క్యాడర్ రంగంలోకి దిగేందుకు సిద్ధమవుతున్నారు. ఉమ్మడి జిల్లాలోని ముగ్గురు మంత్రులు విప్ తో పాటు పార్టీ ఎమ్మెల్యేలు పార్టీ నియోజకవర్గ ఇంచార్జి లు గెలుపు గు ర్రాల కోసం అన్వేషిస్తున్నారు.

ఉమ్మడి జిల్లా లో గ్రామపంచాయతీలు 1229 ఉన్నాయి. కరీంనగర్ జిల్లాలో 318 గ్రామ పంచాయతీ లు ఉన్నాయి. అలాగే జగిత్యాల జిల్లాలో 385, పెద్దపల్లి జిల్లాలో 266, రాజన్న సిరిసిల్ల జిల్లాలో 260 గ్రామపంచాయతీలు ఉ న్నాయి.కరీంనగర్ జిల్లాలో 15 జెడ్పిటిసి, 170 ఎంపిటిసి స్థానాలు ఉన్నాయి. అలాగే జగిత్యాల జిల్లాలో 20 జెడ్పిటిసి, 216 ఎంపిటిసి, పెద్దపల్లి జిల్లాలో 14 జడ్పిటిసి, 137 ఎంపీటీసీ, రాజన్న సిరిసిల్ల జిల్లాలో 12 జెడ్పిటిసి, 123 ఎంపీటీసీ స్థానాలు ఉన్నాయి. ముందుగా గ్రామపంచాయతీ సర్పంచ్ ఎన్నికలు జరగనున్నాయి.

డిసెంబర్ రెండోవారంలో...

డిసెంబర్ రెండో బారంలో పంచాయతీ ఎన్నికల నోటి ఫికేషన్ విడుదల కానుంది. డి సెంబర్ 15 లోపు మొత్తం ప్రక్రియ పూర్తి చే యాలని ప్రభుత్వం నిర్ణయించింది. పంచాయతీ ఎన్ని కలు నిర్వహించాలని కేబినెట్ నిర్ణయం తో పల్లెల్లో మరోసారి స్థానిక ఎన్నికల సందడి మొదలయింది. తెలంగాణ ప్ర భుత్వం స్థానిక సంస్థల ఎన్నికలపై కీలక నిర్ణయం తీసుకుంది. ప్రజాపా లన వారోత్సవాల అనంతరం ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించింది.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన మంత్రివర్గం సమావేశంలో డిసెంబర్ 1 నుంచి 9వ తేదీ వరకు ప్రజాపాలన వారోత్సవాలు నిర్వహించాలని మంత్రివర్గం నిర్ణయిం చింది. ఈ వారోత్సవాల అనంతరం ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయిం చింది. డిసెంబర్ రెండో వారంలో స్థానిక ఎన్నికల నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. 

పార్టీ పరంగా..

పార్టీ పరంగా 42శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ.. గ్రామ పంచాయతీ ఎన్ని కల కు వెళ్లాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. అయితే మొ దట గ్రామాల్లో ఎన్నికలు నిర్వ హిం చాలని నిర్ణయించింది ప్రభుత్వం మార్చి 31లోపు 15వ ఆర్థిక సంఘం కాలప రిమితి ముగియనుండడంతో అప్పటిలోగా ఎన్నికలు పూర్తి చేయాలని భావిస్తోంది.

అలా కుదరకపోతే.. గ్రామా లకు రావాల్సిన దాదాపు రూ.3వేల కోట్ల నిధులు కోల్పోతామని భావిస్తోంది. బీసీలకు కాంగ్రెస్ పార్టీ పరంగానూ 42శాతం రిజర్వేషన్లు ఇచ్చేందుకు మంత్రి మం డలి ఆమోదం తెలిపింది. దీనిలో భాగం గా తెలంగాణ ప్రభుత్వం పం చాయతీ ఎన్నికల ప్రక్రియను వేగవంతం చేస్తోం ది. 

మంత్రివర్గ సమావేశంలో గ్రామీ ణ పాలనను పునరుద్ధరించే దిశగా కీలక నిర్ణయాలు తీసుకోవడంతోపాటు.. అధికారులు దీనిపై కసరత్తు ముమ్మరం చేశారు.. డిసెం బర్ 15లోపు మొత్తం ప్రక్రియ పూరి చేయాలన్న లక్ష్యాన్ని ప్రభుత్వం నిర్దేశిం చింది. ప్రస్తుతం అమల్లో ఉన్న 23శాతం బీసీ రిజర్వేషన్లను మొత్తం రిజర్వేషన్లు 50శాతంకు లోపే ఉండే లా గ్రామాల వారీగా పునర్విభజన చేయాలని ప్రభు త్వం నిర్ణయించింది. ఇందుకోసం ప్రత్యే క కమిషన్ కు రిజర్వేషన్ల ఖరారుపై ఆదేశాలుపంపింది.