17 August, 2026 | 1:53 PM

‘మహిళా శక్తి’పై లెక్కలు!

17-06-2024 12:25 AM
  • పథకం అమలు విధానాలపై కసరత్తు
  • స్వయం సహాయక బృందాల ప్రయోజనమే లక్ష్యం
  • ప్రణాళికల రూపకల్పనలో అధికారులు

హైదరాబాద్, జూన్ 16 ( విజయక్రాంతి) : ఎన్నికల కోడ్ ముగిసింది. పథకాల అమలుపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. ముఖ్యంగా మహిళలకు స్వయం ఉపాధి కల్పించే అం శాన్ని సీరియస్‌గా తీసుకుంది. ‘తెలంగాణ మహిళా శక్తి’ కార్యక్రమం అమలుకు రంగం సిద్ధం చేస్తోంది. 63.86 లక్షల మంది కలిగిన స్వయం సహాయక బృందాల ఆర్థిక పరిపుష్టి లక్ష్యంగా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ఇందుకు అవసరమైన నిధులు, మౌలిక వసతులపై లెక్కలు వేసే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. మహిళా శక్తి పథకం కింది స్వయం సహాయక సంఘాల ద్వారా చిన్న చిన్న పరిశ్రమలు, వ్యాపారాలను ప్రో త్సహించి సభ్యులకు ఆర్థిక భరోసా కల్పించనున్నారు.

ఇందుకు స్వయం సహాయక సంఘాలకు వచ్చే ఐదేళ్లలో బ్యాంకులు, స్త్రీని ధి ద్వారా లక్ష కోట్ల రుణాన్ని అందించనున్నారు.  వీటిలో  చిన్న పరిశ్రమలు, వ్యాపా రాలకు రూ.25 వేల కోట్లను వినియోగించనున్నారు. అలాగే, ప్రతి సంవత్సరం 5 వేల గ్రామాలకు రూ.5 వేల కోట్లను కేటాయించనున్నారు. అదనంగా ప్రతి అసెంబ్లీ నియో జక వర్గంలో మినీ ఇండస్ట్రీయల్ పార్కు నెలకొల్పాలని ప్రభుత్వం యోచిస్తోంది. అవ సరమైన మార్కెటింగ్ వ్యవస్థను కూడా అం దుబాటులోకి తీసుకొచ్చేలా ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. అంతేకాదు,  స్వయం సహా యక సంఘాల సభ్యులకు రూ.10 లక్షల జీవిత బీమా కల్పించనుంది. మొత్తంగా మహిళల ఆర్థిక స్వావలంబన దిశగా రేవంత్ సర్కారు అడుగులు వేస్తోంది.