17 August, 2026 | 3:05 PM

ఫాదర్స్ డే శభాకాంక్షలు తెలిపిన మంత్రి సీతక్క

17-06-2024 12:25 AM

హైదరాబాద్, జూన్ 16 ( విజయక్రాంతి) : రాష్ట్రప్రజలకు పంచాయతీరాజ్, శిశు సంక్షేమశాఖ మంత్రి సీతక్క  ఆదివారం  ఫాదర్స్ డే శుభాకాంక్షలు తెలిపారు. మనల్ని లాలిస్తూ పాలిస్తూ ఆలన, పాలన చూసే అనురాగ శీలి నాన్న అంటూ ట్వీట్ చేశారు. అడగడుగునా మన తప్పటడుగుల్ని సరిదిద్దే గురుశీలి నాన్న అని గుర్తు చేశారు. మన సంతోషాలు, బాధలు పంచుకునే స్నేహశీలి నాన్న, మన ఉన్నతిని కాంక్షించే  నిస్వార్థ శీలి నాన్న.. అంటూ తన తండ్రితో దిగిన ఫొటోను షేర్ చేశారు.