రిజర్వేషన్ల సమస్య తీరదా?
బెంగాల్‌లో 2010 నుంచి ఇప్పటివరకు జారీ చేసిన దాదాపు 5 లక్షల ఓబీసీ సర్టిఫికెట్లు చెల్లవని కోల్‌కతా హైకోర్టు ఇచ్చిన తీర్పు షాక్‌కు గురి చేసింది. ముస్లింలను ఓబీసీలుగా పరిగణిస్తూ ఈ సర్టిఫికెట్లు ఇచ్చారనేది పిటిషనర్ల ప్రధాన ఆరోపణ. ఈ సర్టిఫికెట్లను రద్దు చేసి కొత్తగా సర్టిఫికెట్లను జారీ చేసే బాధ్యతను రాష్ట్ర బీసీ కమిషన్‌కు అప్పగిస్తూ న్యాయస్థానం తీర్పు ఇచ్చింది. అయితే ఈ తీర్పు ప్రభావం ఇప్పటికే ఈ సర్టిఫికెట్లపై ఉద్యోగాలు పొందిన వారిపై ఉండదని కోర్టు పేర్కొనడం కొంతలో కొంత ఊరట కలిగించే విషయం. అధికారంలో ఉండేవారు రాజకీయ కారణాలపై తీసుకునే నిర్ణయాలకు అమాయకులైన విద్యార్థులను, నిరుద్యోగులను బలిపశువులను చేయడం ఏం న్యాయం? శాశ్వత పరిష్కా రంగా కేంద్రమే ఒక విధానాన్ని రూపొందిస్తే బాగుంటుంది.
- కె. సంతోష్ రావు, హనుమకొండ






