13 July, 2026 | 9:41 PM

Breaking News

నులిపురుగులను నిర్మూలిద్దాం... ఆరోగ్యాన్ని కాపాడుకుందాం   •   ఫేక్ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్తో పట్టా మార్పిడిపై విచారణ అధికారిగా ఆర్డీవో మధు   •   నులిపురుగుల నివారణ మాత్రలు తప్పక వేయించాలి   •   వైటీసీ ద్వారా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలి   •   జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవ సందర్బంగా ఆల్బండజోలు మాత్రలు పంపిణి   •   పదోన్నతిపై బదిలీ అయిన పోస్టల్ ఉద్యోగులకు ఘనంగా సన్మానం   •   విద్యార్థినీల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు   •   ప్రజావాణి దరఖాస్తులు క్షేత్రస్థాయిలోకి వెళ్లి పరిష్కరించాలి   •   లక్క పురుగుతో ఇబ్బందులు పడుతుంటే అధికారులు నిద్రపోతున్నారా..?   •   వైటీపీఎస్ టెండర్లను రద్దు చేయాలి   •  

సూర్యాపేటలో క్యాంపు రాజకీయాలు

12-02-2026 10:50 AM

హైదరాబాద్: సూర్యాపేటలో క్యాంపు రాజకీయాలు(Suryapet Camp politics) మొదలయ్యాయి. హైదరాబాద్ శివార్లలో బీఆర్ఎస్ అభ్యర్థులు క్యాంపు పెట్టారు. సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి అభ్యర్థులను తరలించారు. సూర్యాపేటలో అధిపత్యం నిలిపుకునేందుకు మాజీ మంత్రి క్యాంపు రాజకీయం చేస్తున్నారు.

మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ సూర్యాపేటపై పట్టుకు ప్రయత్నం చేస్తోంది. ఉమ్మడి ఆదిలాబాద్ లోనూ క్యాంప్ పాలిటిక్స్ జరుగుతున్నాయి. అభ్యర్థులను కాపాడుకునేందుకు బీజేపీ, బీఆర్ఎస్ నేతలు ఎత్తులు వేస్తున్నారు. మంచిర్యాల నుంచి తడోబా క్యాంపుకు 26 మంది బీజేపీ అభ్యర్థులను తరలించారు. 36 మంది బీజేపీ అభ్యర్థులను ఆదిలాబాద్ నుంచి అయోధ్యకు తరలించారు. ఖానాపూర్ బీఆర్ఎస్ అభ్యర్థులను గతరాత్రే రహస్య ప్రాంతనికి తరలించారు. ఈ నెల 16 వరకు క్యాంపులోనే అభ్యర్థులు ఉండనున్నారు.