తీన్మార్ మల్లన్న గెలుపునకు ప్రచారం
23-05-2024 07:30 AM
భద్రాద్రి కొత్తగూడెం, మే 22 (విజయక్రాంతి): నల్లగొండ, ఖమ్మం, వరంగల్ జిల్లాల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్న విజయాన్ని కాంక్షిస్తూ బుధవారం కొత్తగూడెం నియోజకవర్గం లో మిత్రపక్షాల నాయకులు విస్తృత ప్రచారం చేశారు. ప్రభుత్వ కార్యాలయాలు, క్రీడా మైదానాల్లో పట్టభ ద్రులను కలిసి తీన్మార్ మల్లన్నకు ఓటు వేయాలని అభ్యర్థించారు. పాల్వంచలో డీసీఎంఎస్ చైర్మన్ కొత్వాల శ్రీనివాసరావు నేతృత్వంలో విద్యుత్తు కేంద్ర కార్యాలయం, పురపాలక సంఘం కార్యాలయం, పోలీస్ స్టేషన్, తహసిల్దార్, ఎండీవో కార్యాలయాల్లో ప్రచారం నిర్వహించి అధికారులను ఓట్లు అడిగారు. కొత్తగూడెంలో తీన్మార్ మల్లన్నను గెలిపించాలని సీపీఐ నాయకులు ప్రచారం చేశారు.






